Azadi Ka Amrit Mahotsav : భారతీయులకు స్వాతంత్య్రం వచ్చి, వారంతా స్వేచ్ఛావాయువులు పీల్చడం మొదలుపెట్టి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆల్బెర్టా దేశ రవాణా శాఖ మంత్రి ప్రసాద్ పండా శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్రానికి ముందు, అనంతరం దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన పోరాట యోధులకు, మహనీయులకు ఈ సందర్భంగా సెల్యూట్ చేశారు.
"ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కొత్త సంకల్పంతో కొత్త దిశలో అడుగు పెట్టే సమయమని భారత ప్రధాని మోదీ అన్నారు. దేశం కోసం స్వాతంత్య్ర సమరయోధుల కలలను నెరవేర్చడానికి, 130 కోట్ల (1.3 బిలియన్) ప్రజల “టీమ్ ఇండియా” అమృత్ కాల్ (రాబోయే 25 సంవత్సరాలు)లోని “పంచ్ ప్రాణ్” (ఐదు ప్రతిజ్ఞలు)పై దృష్టి పెట్టాలని మోదీ విజ్ఞప్తి చేశారు. భారత దేశ అభివృద్ధి, వలసల జాడను తగ్గించడం, భారతీయ వారసత్వం, చారిత్రక అంశాల గురించి స్మరించడం.. భారతీయ చరిత్రను చూసి గర్వపడటం, నిజాయితీగా భారతపౌరుల బాధ్యతను నిర్వర్తించడం అనేవి మోదీ చెప్పిన ఐదు ప్రతిజ్ఞలు. మహిళలను గౌరవించడమే వారికి మనం ఇచ్చే గొప్ప ఆస్తి అని మోదీ అన్నారు. మహిళల్లోని ప్రతిభను వెలికితీయడం ద్వారా దేశ ప్రగతికి పూల బాట వేద్దామన్నారు." అని మంత్రి ప్రసాద్ పండా తెలిపారు.