నేరాల నియంత్రణకు ఎన్కౌంటర్లు చేయడం సరికాదని ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ (ఏఐఎల్యూ) జాతీయ అధ్యక్షుడు బికాస్ రంజన్ భట్టాచార్య అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో డిసెంబర్ 26 నుంచి 29 వరకూ జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కింది స్థాయి కోర్టుల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
న్యాయవ్యవస్థను బలోపేతం చేసినప్పుడు మాత్రమే నేరాల నియంత్రణ సాధ్యమని ఏఐఎల్యూ జాతీయ ప్రధాన కార్యదర్శి పోలి సత్యనారాయణ అభిప్రాయపడ్డారు.