ETV Bharat / city

పేర్ని నానితో భేటీపై స్పందించిన మోహన్ బాబు

author img

By

Published : Feb 13, 2022, 5:28 PM IST

Mohanbabu about AP CM Jagan and Chandrababu : మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన లేదన్నారు ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు. జగన్, చంద్రబాబు తనకు ఇద్దరూ బంధువులేనని చెప్పారు. మంత్రి పేర్నినానితో భేటీ అంశంపై అనవసరం రాద్ధాంతం చేయవద్దని హితవు పలికారు.

Mohan babu about AP CM Jagan, mohan babu about perni nani
పేర్ని నానితో భేటీపై స్పందించిన మోహన్ బాబు

Mohanbabu about AP CM Jagan and Chandrababu : జగన్, చంద్రబాబు తనకు ఇద్దరూ బంధువులేనని ప్రముఖ సినీనటుడు మోహన్ బాబు తెలిపారు. ఇద్దరి కోసం ఎన్నికల్లో ప్రచారం నిర్వహించామని మోహన్ బాబు స్పష్టం చేశారు. మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశం తనకు లేదన్న ఆయన.. సినిమాలు, విద్యాసంస్థలు తప్ప ఎలాంటి ఆలోచనా లేదని స్పష్టం చేశారు. ఇటీవల తన నివాసంలో మంత్రిపేర్ని నానితో జరిగిన సమావేశంపై వస్తున్న విమర్శలను మోహన్ బాబు తీవ్రంగా ఖండించారు. పేర్నినాని తనకు స్నేహితుడని, బొత్స కుమారుడి వివాహానికి వచ్చిన సందర్భంగా పేర్ని నానిని ఇంటికి ఆహ్వానించినట్లు వివరించారు.

'రాద్దాంతం చేయవద్దు'

పేర్ని నానితో సినీ పరిశ్రమపై జరిగిన సమావేశం గురించి ఎలాంటి వాకబూ చేయలేదన్న మోహన్ బాబు.. ఆ సమావేశంపై అనవసర రాద్ధాంతం చేయవద్దని హితవు పలికారు. ముఖ్యమంత్రులు, గవర్నర్లు సహా ఎంతో మంది ప్రముఖులు తన ఇంటికి అతిథులుగా వస్తారని చెప్పుకొచ్చారు. మోహన్ బాబు నటించిన 'సన్నాఫ్ ఇండియా' చిత్రం ఈ నెల 18న విడుదలవుతున్న సందర్భంగా 'ఈనాడు-ఈటీవీ భారత్'తో మాట్లాడిన మోహన్ బాబు.. ఏపీ మంత్రి పేర్ని నానితో సమావేశంపై స్పష్టత ఇచ్చారు. అలాగే తిరుపతిలోని తన విద్యాసంస్థల ప్రాంగణంలో నిర్మిస్తున్న షిరిడి సాయిబాబా దేవాలయాన్ని ఏప్రిల్ లేదా మే లో ప్రారంభించనున్నట్లు తెలిపారు.

ఎలాంటి సంబంధమూ లేదు - మంత్రి పేర్ని నాని
Vishnu Manchu - Perni Nani సీనియర్‌ నటుడు మోహన్‌బాబును తాను వ్యక్తిగతంగానే కలిశానని, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ మీటింగ్‌తో ఎలాంటి సంబంధమూ లేదని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని అన్నారు. శుక్రవారం మోహన్‌బాబు కుటుంబాన్ని ఆయన కలిసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఫొటోను విష్ణు ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. తెలగు చిత్రపరిశ్రమ సంక్షేమానికి కృషి చేస్తున్నందుకు నానికి విష్ణు ధన్యవాదాలు చెప్పారు. గురువారం చిరంజీవి, ఇతర సినీ పెద్దలు ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమైన తర్వాత మోహన్‌బాబును నాని కలవడంపై పలు మీడియాల్లో వరుస కథనాలు చక్కర్లు కొట్టాయి. ఈ కథనాలపై మంత్రి స్పందించారు.

‘‘మోహన్‌బాబు నాకు ఎప్పటి నుంచో ఆప్తమిత్రుడు. 2002 నుంచి మా ఇద్దరి మధ్య స్నేహం ఉంది. మంత్రి బొత్స సత్యనారాయణ ఇంట్లో జరిగిన పెళ్లి కోసం నేను హైదరాబాద్‌ వెళ్లాను. అదే సమయంలో కాఫీకి రమ్మని మోహన్‌బాబు నుంచి ఆహ్వానం అందడంతో ఆయన ఇంటికి వెళ్లాను. మేమిద్దరం కాసేపు మాట్లాడుకున్నాం. జగన్‌తో సినీ ప్రముఖుల భేటీకి తాను వద్దామనుకున్నా. కాకపోతే ఎవరి నుంచీ కబురు అందకపోవడంతో రాలేదని చెప్పారు. అదే విషయాన్ని ముఖ్యమంత్రి జగన్‌కు చెప్పమని చెప్పారు. అక్కడ నుంచి బయలుదేరే సమయంలో విష్ణు నన్ను శాలువాతో సత్కరించారు. అయితే, మొన్న సినిమా ప్రముఖులతో జరిగిన మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాలపై వివరణ ఇచ్చేందుకే మోహన్‌బాబుని కలిశానంటూ వార్తలు రావడం విచారకరం. ఇదే విషయంపై కొంతమంది మీడియా వాళ్లని అడగ్గా.. మంచు విష్ణు ఆ విధంగా ట్వీట్ చేశాడని.. అందుకే తాము అలా రాశామని చెప్పారు. దీనిపై విష్ణుకు ఫోన్‌ చేశా. ‘మొదట చేసిన ట్వీట్‌ని మార్చి మరోసారి ట్వీట్‌ చేశాన’ని అన్నారు’’ అని నాని చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి : రాహుల్ గాంధీపై అసోం సీఎం వ్యాఖ్యలను ఖండించిన పీసీసీ.. రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.