ETV Bharat / city

మాజీమంత్రి అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్‌ కొట్టివేసిన ఏపీ హైకోర్టు

ఏపీ మాజీమంత్రి అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్​ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. ఆయనతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఈఎస్​ఐ డైరక్టర్ డా.రమేశ్​కుమార్, పితాని సత్యనారాయణ మాజీ పీఎస్ మురళీ , మరో నిందితుడు సుబ్బారావు బెయిల్ పిటిషన్లను సైతం హైకోర్టు కొట్టేసింది.

ap highcourt rejected achannaidu bail
మాజీమంత్రి అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్‌ కొట్టివేసిన ఏపీ హైకోర్టు
author img

By

Published : Jul 29, 2020, 10:54 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని మాజీమంత్రి అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్​ను ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. ఆయనతో పాటు ఈఎస్ఐ కేసులో అరెస్ట్ అయిన మరికొంత మంది నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను సైతం కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈఎస్​ఐ ఔషధాల కొనుగోలు, కాల్ సెంటర్ల కాంట్రాక్ట్​లో అవకతవకలు జరిగాయని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ ఈఎస్​ఐ డైరక్టర్ డా.రమేశ్​ కుమార్​తో పాటు మరికొందరిని అవినీతి నిరోధక శాఖ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ కేసులో బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పటికే అచ్చెన్నాయుడుని పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారని ..పూర్తి సమాచారం సేకరించారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. అరెస్ట్ చేసి నెలరోజులు పైన గడిచిందని... రాజకీయ కక్షతోనే మాజీమంత్రిపై కేసు నమోదు చేశారని వాదించారు.

కేసులో ఇంకా కొంతమంది కీలక నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉందని దర్యాప్తు కొనసాగుతుండగా బెయిల్ ఇవ్వొద్దని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు పరిగణలోకి తీసుకుని బెయిల్ పిటిషన్​ను కొట్టేస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఈఎస్​ఐ డైరక్టర్ డా.రమేశ్​ కుమార్, పితాని సత్యనారాయణ మాజీ పీఎస్ మురళీ , మరో నిందితుడు సుబ్బారావు బెయిల్ పిటిషన్లను సైతం హైకోర్టు కొట్టేసింది.

ఇదీ చదవండి: లారీని ఢీకొట్టిన కారు... ఎస్‌బీఐ ఉద్యోగి సజీవదహనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.