ETV Bharat / city

వేతనాలు పెంచకుంటే సమ్మె : హెల్త్ మిషన్ సిబ్బంది - జాతీయ హెల్త్ మిషన్ సిబ్బంది ఆందోళన

వారంతా అకౌంటెంట్లు.. జాతీయ ఆరోగ్య మిషన్ లెక్కలు మొత్తం వారే చూసుకుంటారు. ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్నా తమ వేతనాలు పెంచడం లేదని వాపోతున్నారు. కోఠిలోని ప్రభుత్వ వైద్య విద్యా సంచాలకుల కార్యాలయం ముందు జీతాలు పెంచాలంటూ ఆందోళన చేశారు.

accountants do not increase their wages they will go on strike
'వేతనాలు పెంచకుంటే సమ్మెకు వెళతాం'
author img

By

Published : Jul 17, 2020, 3:39 PM IST

హైదరాబాద్ కోఠిలోని ప్రభుత్వ వైద్య విద్యా సంచాలకుల కార్యాలయం ముందు వేతనాలు పెంచాలంటూ జాతీయ హెల్త్ మిషన్ సిబ్బంది ఆందోళనకు దిగారు. అర్బన్ హెల్త్ మిషన్(యూహెచ్​సీ)లో అకౌంటెంట్లుగా అనేక ఏళ్లుగా పని చేస్తున్నట్లు వారు తెలిపారు.

తమ జీతాలు పెంచాలంటూ అధికారుల చుట్టు తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అనేక మార్లు సీఎం క్యాంప్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టామన్నారు. కొవిడ్ సమయంలో తీవ్ర పని ఒత్తిడితో పనిచేస్తున్నా తమకు వేతనాలు పెంచకపోతే.. వచ్చే నెల సమ్మెకు వెళతామని వారు హెచ్చరించారు.

ఇదీ చూడండి : రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లో గార్డెన్లు ఏర్పాటవ్వాలి : కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.