ETV Bharat / city

గుంటూరు జీజీహెచ్‌ నుంచి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్‌ - మాజీ మంత్రి అచ్చెన్న అరెస్ట్ వ్యవహారం

తెలుగుదేశం ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును గుంటూరు జీజీహెచ్‌ నుంచి డిశ్చార్జి చేశారు. ఆరోగ్యం బాగోలేదని చెప్పినా ఎలా డిశ్చార్జ్ చేస్తారంటూ తెదేపా నేతలు ప్రశ్నించారు. కనీసం కొవిడ్‌ టెస్టు చేయకుండా ఎలా పంపిస్తారని నిలదీశారు. కోర్టు ఉత్తర్వులను కూడా పట్టించుకోకుండా ప్రవర్తిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గుంటూరు జీజీహెచ్‌ నుంచి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్‌

author img

By

Published : Jul 1, 2020, 8:36 PM IST

తెలుగుదేశం ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును గుంటూరు జీజీహెచ్‌ నుంచి డిశ్చార్జి చేశారు. ఈఎస్‌ఐ కుంభకోణంలో అరెస్టైన అచ్చెన్నాయుడును వినీతి నిరోధకశాఖ ఆదేశాలతో జూన్ 13న జీజీహెచ్‌లో చేర్పించారు. ఇప్పుడు గుంటూరు జీజీహెచ్‌ నుంచి డిశ్చార్జి చేసి విజయవాడ సబ్‌జైలుకు తరలించారు. విజయవాడ సబ్‌ జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఎలా డిశ్చార్జ్ చేస్తారు..?

గుంటూరు జీజీహెచ్‌ నుంచి అచ్చెన్నాయుడిని డిశ్చార్జ్ చేసేందుకు సన్నాహాలు ప్రారంభమైనపుడే... తెలుగుదేశం నేతలు అక్కడకు చేరుకున్నారు. ఆరోగ్యం బాగోలేదని చెప్పినా ఎలా డిశ్చార్జ్ చేస్తారంటూ ప్రశ్నించారు. కనీసం కొవిడ్‌ టెస్టు చేయకుండా ఎలా పంపిస్తారని నిలదీశారు. కోర్టు ఉత్తర్వులను కూడా పట్టించుకోకుండా ప్రవర్తిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతకుముందు జీజీహెచ్ సూపరింటెండెంట్‌కు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. కరోనా పరీక్షలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కొవిడ్ పరీక్ష చేయకుండా జైలు అధికారులు అనుమతించరని, కొలనోస్కోపి పరీక్షా ఫలితాలు ఇంకా రాలేదని వివరించారు.

ఇవీ చదవండి: అచ్చెన్నాయుడి ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాటం:చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.