హైదరాబాద్ దుండిగల్‌లోని మర్రి లక్ష్మారెడ్డి కళాశాల బస్సు ఢీకొని నిన్న అదే కాలేజ్‌కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి నాగిరెడ్డి వీరేశ్‌రెడ్డి మృతి చెందాడు. ఈ విషయాన్ని కళాశాల యాజమాన్యం కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఏబీవీపీ నాయకులు ఆందోళనకు దిగారు. చనిపోయిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఫిట్నెస్ లేని బస్సులు, అర్హత లేని డ్రైవర్ల వల్లే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడని ఆరోపించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఏబీవీపీ నాయకులను అరెస్టు చేసి దుండిగల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
- ఇదీ చూడండి : నయీం కేసులో బయటకొచ్చిన రాజకీయ నేతలు, పోలీసుల పేర్లు