ETV Bharat / city

Aashaadha saare: ఆషాడ సారె కావిడి.. టన్నుల కొద్దీ ఎప్పుడైనా చూశారా..! - east godavari

నవవధువు అత్తారింటికి వచ్చేటప్పుడు సారె కావిడి పట్టుకు రావడం తెలుగునాట అనాదిగా వస్తున్న సంప్రదాయం. గోదావరి జిల్లాల్లో ఈ ఆచారాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఘనంగా సారె పంపిస్తుంటారు. అయితే ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన బత్తుల బలరామకృష్ణ తన వియ్యాల వారింటికి పంపిన సారె.. ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

Aashaadha saare
ఆషాఢ సారె
author img

By

Published : Jul 19, 2021, 4:05 PM IST

సాధారణంగా సారెను వధువు తల్లిదండ్రులు.. వారి ఆర్థిక పరిస్థితిని బట్టి పెడుతూ ఉంటారు. పెళ్లి అయిన తొలిరోజుల్లో పసుపు కుంకుమతో కలిపి సారె పట్టుకొని వధువు అత్తింటిలో అడుగుపెడుతుంది. ఆ తర్వాత చంటిబిడ్డతో మరోసారి సారె తీసుకెళ్తుంది. ఈ మధ్యలో ఆషాడం సారె కావిడి పెట్టడం గోదావరి జిల్లాల్లో పరిపాటి. పది రకాల స్వీట్లు, 50 కేజీల హాటు.. ఆ సీజన్లో దొరికే నాలుగైదు రకాల పండ్లు.. బెల్లంతో తయారుచేసిన చలివిడి.. సారె బిందెలను కావెళ్లు పెట్టి కొత్త పెళ్లి కూతురుని అత్త వారి ఇంటికి తీసుకొచ్చి అప్పగిస్తారు. ఆషాఢమాసంలో వియ్యంకుడు వియ్యాల వారికి సారె పంపించటం.. కొన్ని ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం. ఆ విధంగా వచ్చిన సారె టన్నులకొద్దీ ఉంటే ఆశ్చర్యపోతారు కదా..!

aashadam

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాంకు చెందిన తోట రాజు దంపతుల కుమారుడు పవన్ కుమార్​కు.. రాజమండ్రికి చెందిన బత్తుల బలరామకృష్ణ కుమార్తె ప్రత్యూషతో గత నెలలో వివాహం జరిగింది. ఆషాఢ మాసం సందర్భంగా అమ్మాయి తండ్రి వియ్యాల వారికి.. ఐదు వాహనాల్లో 100 రకాల స్వీట్లు, 50 రకాల హాట్లు, 100 కేజీల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, 10 రకాల కూరగాయలు, వెయ్యి కేజీలు బతికి ఉన్న చేపలతో పాటు పది మేకలు, పాతిక కోళ్లు.. పంపించి వియ్యాలవారిని అబ్బురపరిచాడు.

మేకల చెవులకు బంగారు రింగులు

ఇందులో మరో విశేషం ఏంటంటే రెండు మేకల చెవులకు బంగారు రింగులు ఉన్నాయి. నూతన వధువు సారె తీసుకురావడమనే ఆచారం తమ దగ్గర ఎప్పటి నుంచో ఉందని వరుడి తండ్రి యానాంకు చెందిన తోట రాజు తెలిపారు. అయితే వియ్యంకుడు పంపిన భారీ ఆషాఢం సారె కావిడి ఇంత వరకూ ఎవరూ పంపించి ఉండరంటూ సంతోషం వ్యక్తం చేశారు.

బంధువులకు కూడా సారెను పంపిస్తాం..!

ఈ ఏడాది కరోనా కారణంగా బంధువులు లేకుండా పెళ్లి నిరాండబరంగా చేశామంటున్న వరుడు తండ్రి.. సారెను ఆత్మీయులకు బహుమతిగా పంపిస్తామన్నారు.

ఇవీ చూడండి:

Gold Price Today: తగ్గిన పసిడి ధరలు- తెలుగు రాష్ట్రాల్లో ఇలా!

Accident: హైదరాబాద్‌-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.