సికింద్రాబాద్ అల్వాల్ పీఎస్ పరిధిలోని ఎమ్ఈఎస్ కాలనీలో నివాసముంటున్న విశ్వజిత్ అనే విద్యార్థి ఆరోతరగతి చదువుతున్నాడు. పాఠశాలకు వెళ్లి వస్తున్న సమయంలో ఒక్కసారిగా కుక్కలు దాడిచేయడం వల్ల అతను తీవ్రగాయాలపాలయ్యాడు. గమనించిన స్థానికులు కుక్కల్ని తరిమి విశ్వజిత్‌ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కొన్నిరోజులుగా కుక్కల బెడద తమని ఆందోళనకు గురిచేస్తోందని, జీహెచ్ఎంసీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా... ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- ఇదీ చూడండి : మహానగరంలో సీజన్ మొత్తంలోనే అత్యధిక వర్షపాతం నమోదు