Sankranti Rangoli: ఏపీలోని కడప జిల్లా పెండ్లిమర్రి మండలం నందిమండలం గ్రామానికి చెందిన 95 ఏళ్ల వృద్ధురాలు సంక్రాంతి ముగ్గువేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. సరిగా నడవలేని పరిస్థితిలోనూ పండగ వేళ తన ఇంటి ముందు ముగ్గు వేసింది. బండపై కూర్చొని తనకు వచ్చిన రీతిలో ముగ్గువేసి ఆనందపడింది. మరోవైపు కర్నూలు జిల్లాలో తీరొక్క ముగ్గులతో మహిళలు పండగ శోభను రెట్టింపు చేశారు. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి, గొబ్బెమ్మలు పెట్టి పూజలు నిర్వహించారు.
ఇదీచూడండి: Sankranti Festival Special story 2022: ఈ సంక్రాంతి వెలుగులు మనవే!!