ETV Bharat / city

నిరుద్యోగులకు శుభవార్త: ఇండియ‌న్ ఆర్మీ-ఎంఈఎస్‌లో 502 ఖాళీలు - job vacancies in army

ఇండియ‌న్ ఆర్మీ-మిలిట‌రీ ఇంజినీర్ స‌ర్వీసెస్‌(ఎంఈఎస్‌)కి చెందిన పుణెలోని స‌ద‌ర‌న్ క‌మాండ్ చీఫ్ ఇంజినీర్ కార్యాల‌యం కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

indian army, vacancies in Indian Army
నిరుద్యోగులకు శుభవార్త: ఇండియ‌న్ ఆర్మీ-ఎంఈఎస్‌లో 502 ఖాళీలు
author img

By

Published : Mar 25, 2021, 4:34 PM IST

నిరుద్యోగులకు ఇండియన్​ ఆర్మీ తీపికబురు అందించింది. ఎంఈఎస్‌లో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

  • మొత్తం ఖాళీలు: 502

1) డ్రాఫ్ట్స్‌మెన్: 52

అర్హ‌త‌: గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఆర్కిటెక్చ‌ర‌ల్ అసిస్టెంట్స్‌షిప్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నుల్లో ఏడాది అనుభ‌వం ఉండాలి.

వ‌య‌సు: 18-30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

2) సూప‌ర్‌వైజ‌ర్ (బార‌క్స్ అండ్ స్టోర్స్‌): 450

అర్హ‌త‌: ఎక‌న‌మిక్స్‌/ కామ‌ర్స్‌/ స్టాటిస్టిక్స్‌/ బిజినెస్ స్ట‌డీస్‌/ ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్ స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ/ మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో ఏడాది అనుభ‌వం ఉండాలి.

వ‌య‌సు: 18-30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత ప‌రీక్ష‌లో ప్ర‌తిభ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది. ఓఎంఆర్ బేస్డ్ విధానంలో ఈ ప‌రీక్ష నిర్వ‌హిస్తారు.

ప‌రీక్షా విధానం: ఈ ప‌రీక్ష 125 మార్కుల‌కు ఉంటుంది. ఇందులో నాలుగు విభాగాల నుంచి 100 ప్ర‌శ్న‌లు ఉంటాయి. ప‌రీక్షా స‌మ‌యం 120 నిమిషాలు ఉంటుంది. కింద సూచించిన విధంగా వివిధ విభాగాల నుంచి ప్ర‌శ్న‌లు, మార్కులు ఉంటాయి.

  • జ‌న‌ర‌ల్ ఇంట‌లిజెన్స్ అండ్ రీజనింగ్ - 25 ప్ర‌శ్న‌లు - 25 మార్కులు
  • జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ అండ్ జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్ - 25 ప్రశ్న‌లు - 25 మార్కులు
  • న్యూమ‌రిక‌ల్ ఆప్టిట్యూడ్ - 25 ప్రశ్న‌లు - 25 మార్కులు
  • స్పెషలైజ్‌డ్ టాపిక్ - 25 ప్ర‌శ్న‌లు - 50 మార్కులు

‌ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తు ఫీజు: ఇత‌రులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడ‌బ్ల్యూడీ/ మ‌హిళా అభ్య‌ర్థుల‌కు ఫీజు లేదు.

తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్షా కేంద్రాలు: సికింద్రాబాద్‌, వైజాగ్‌.

ముఖ్య‌మైన తేదీలు:

  • ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 22.03.2021.
  • ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 12.04.2021.
  • ప‌రీక్ష తేదీ: 16.05.2021.

ఇదీ చూడండి: త్వరలో 50 వేల ఉద్యోగాల భర్తీ: హరీశ్​రావు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.