వివిధ సందర్భాల్లో వేర్వేరు ప్రాంతాల్లో దొరికిన మొబైల్ ఫోన్లను హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ల యజమానులను గుర్తించి.. వారికి అందజేశారు.
ప్రతి అవసరానికి కీలకమైన మొబైల్ ఫోన్లు పోగొట్టుకుని ఇబ్బంది పడుతున్న తమను స్టేషన్కు పిలిపించి ఫోన్లు అందించడం సంతోషంగా ఉందని సదరు యజమానులు తెలిపారు. పోలీసులకు కృతజ్ఞతలు చెప్పారు.
- ఇదీ చూడండి : రాత్రివేళ బైక్ చోరీలు... ఇద్దరు నిందితుల అరెస్ట్