గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 1,886 మందికి కరోనా సోకినట్టుగా వైద్యారోగ్యశాఖ తెలిపింది. మరో 12 మంది కోవిడ్ కారణంగా మరణించినట్టు వెల్లడించింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8 లక్షల 46వేల 245 కు చేరింది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 20 వేల 958గా వైద్యాధికారులు తెలిపారు. గడచిన 24 గంటల వ్యవధిలో2,151 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య8 లక్షల18 వేల 473 కి పెరిగింది.
అత్యధికంగా చిత్తూరులో 291 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాల్లో 282, అనంతపురం - 60, తూర్పు గోదావరి - 227, గుంటూరు - 275, కడప - 67, కృష్ణా - 269, కర్నూలు - 33, నెల్లూరు - 79, ప్రకాశం - 111, శ్రీకాకుళం - 33, విశాఖపట్నం - 97, విజయనగరం జిల్లాలో 62 మందికి వైరస్ సోకినట్టుగా అధికారులు తెలిపారు.
వైరస్‌తో కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా మృతి చెందిన వారి సంఖ్య 6వేల 814కు చేరింది.
ఇదీ చదవండి: భారీగా దిగొచ్చిన బంగారం, వెండి ధరలు