రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. ఆదివారం అత్యధికంగా 154 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 14 మంది చనిపోయారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 132, రంగారెడ్డిలో 12మందికి కరోనా సోకింది.
రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసులు 3,650 కి చేరాయి. ఆస్పత్రిలో చికిత్స నుంచి కోలుకుని ఇప్పటివరకు 1,742 మంది డిశ్ఛార్జి అయ్యారు. మరో 1,771 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మహమ్మారితో మరణించిన వారి సంఖ్య 137కి చేరింది.
జిల్లాలు | కేసులు |
జీహెచ్‌ఎంసీ | 132 |
రంగారెడ్డి | 12 |
మేడ్చల్ | 03 |
యాదాద్రి | 02 |
సిద్దిపేట | 01 |
మహబూబాబాద్ | 01 |
సంగారెడ్డి | 01 |
కరీంనగర్ | 01 |
నాగర్‌కర్నూల్ | 01 |
మొత్తం | 154 |