ETV Bharat / city

దుర్గం చెరువు తీగల వంతెనపై తొలిసారిగా 10కె, 5కె రన్​

author img

By

Published : Jan 24, 2021, 12:33 PM IST

దుర్గం చెరువు తీగల వంతెనపై తొలిసారిగా 10కె, 5కె రన్​ నిర్వహించారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో యువతీ యువకులు ఉత్సాహంగా పాలొన్నారు.

durgam cheruvu
దుర్గం చెరువు తీగల వంతెనపై తొలిసారిగా 10కె, 5కె రన్​

జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని.... హైదరాబాద్‌ దుర్గంచెరువు తీగల వంతెనపై పలుసంస్థలు నిర్వహించిన 10కె, 5కె రన్‌ కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి.

ఇనార్బిట్ మాల్, నిర్మాణ్, ప్యూమా తదితర సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ 10కె రన్‌ను రాష్ట్ర పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ప్రారంభించారు. తీగల వంతెనపై తొలిసారిగా జరిగిన ఈ కార్యక్రమంలో యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పర్యాటక రంగానికి మరింత ప్రాచుర్యంతో పాటు బాలిక విద్య ప్రోత్సాహానికి ముందుకొచ్చిన సంస్థలను అర్వింద్‌కుమార్‌ అభినందించారు.

అనంతరం.. దివ్యాంగుల కోసం నిర్వహిచిన 5కె రన్‌ను రాష్ట్ర పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ప్రారంభించారు. పలువురు దివ్యాంగులు ఈ రన్‌లో ఉత్సాహంగా పాల్గొని... ఆకట్టుకున్నారు.

ఇవీచూడండి: పారిజాత గిరిపై వెలసిన... శ్రీనివాసుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.