ఏపీలో గత 24 గంటల్లో 88,441 మంది నమూనాలు పరీక్షించగా 10,373 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా వైరస్ బారిన పడి 80 మంది మృతి చెందినట్టు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ఫలితంగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 11,376కి చేరింది. గడిచిన 24 గంటల్లో 15,958 మంది కొవిడ్ బారి నుంచి పూర్తిగా కోలుకున్నారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,28,108 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
మరోవైపు రాష్ట్రంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోందని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. రాష్ట్రంలో కోటి 6లక్షల మందికి రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిందని వెల్లడించారు. 45 ఏళ్లు దాటిన వారిలో 50శాతం మందికి ఒక డోసు పూర్తి చేశామని వివరించారు.
ఇదీ చదవండి: Finance Minister:భూమికి బరువైన పంట పండింది: హరీశ్ రావు