ETV Bharat / city

ఇండియా అవుతోంది.. ఈటీవీ భారత్‌ - LIKE

నిత్యం ఉషోదయంతో సత్యం నినదించుగాక అంటూ మొదటితరంలో దినపత్రిక రూపంలో మీ ముందుకొచ్చింది ''ఈనాడు''. వాస్తవాలను కళ్లకు కట్టేందుకు రెండోతరంలో మీటీవీ అంటూ ఈటీవీ మీ ముంగిట నిలిచింది. ఈ రెండింటి మేళవింపుతో  మూడోతరంలో 'ఈటీవీ భారత్‌' పేరుతో డిజిటల్​ మీడియాగా సరికొత్త సంచలన ప్రయాణానికి సిద్ధమైంది.

డిజిటల్ సంచలనం ... ఈటీవీ భారత్‌
author img

By

Published : Mar 21, 2019, 12:16 AM IST

Updated : Mar 21, 2019, 8:06 AM IST

డిజిటల్ సంచలనం ... ఈటీవీ భారత్‌
పత్రికా సామ్రాజ్యంలో ఈనాడు ప్రభంజనం సృష్టిస్తుండగా...దృశ్య శ్రవణ మాధ్యమంలో ఈటీవీ దూసుకెళ్తోంది. ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసే రామోజీ గ్రూప్...మిలీనియల్స్​ కోసం తీసుకొచ్చిన డిజిటల్ విప్లవమే 'ఈటీవీ భారత్‌'.

రామోజీ గ్రూప్ సంస్థల్లో ఈనాడు ఒక సంచలనం. ప్రారంభమైన అతి తక్కువ కాలంలోనే తెలుగుభాషలోనే అత్యధిక సర్క్యులేషన్ కలిగిన దినపత్రికగా ఆవిర్భవించి నేటికీ విజయపరంపర కొనసాగిస్తోంది. ఇక నిష్పక్షపాతంగా ప్రజలకు వార్తలను చేరవేసే మాధ్యమంగా ఈటీవీ నెట్​వర్క్ పేరు ప్రసిద్ధికెక్కింది.

సామాజిక మాధ్యమాల ప్రాబల్యం పెరిగిపోయిన నేటి ప్రపంచంలో నిర్దిష్టమైన వార్తా సమాచారం చాలా కీలకం. డిజిటల్ టెక్నాలజీని ఆకళింపు చేసుకుని మిలీనియల్స్​కి నచ్చే విధంగా మీ ముందుకొస్తోంది ఈటీవీ భారత్​.

వేగం, కచ్చితత్వం, విశ్వసనీయత ప్రధాన ఆయుధాలుగా డిజిటల్ వేదికపై మరో సమాచార విప్లవానికి సిద్ధమైంది ఈటీవీ భారత్​. మొబైల్ యాప్​తో పాటు వెబ్​ పోర్టల్​ రూపంలోనూ అలరించేందుకు సన్నద్ధమైంది. లోతైన విశ్లేషణ, నిబద్ధత కలిగిన జర్నలిస్టులున్న దేశవ్యాప్త నెట్ వర్క్ ఈటీవీ భారత్​ సొంతం. సమాచారం వేగంగా అందించేందుకు అన్ని రాష్ట్రాల్లోని ప్రతి జిల్లా, నియోజకవర్గంలో అక్షరసైనికులు సదా సిద్ధం.

13 భాషలు... 29 రాష్ట్రాలు

ఒకటి కాదు రెండు కాదు... 13 భాషలు... 29 రాష్ట్రాల్లో ఈటీవీ భారత్‌ యాప్‌ అందుబాటులోకి వస్తోంది. హిందీ, తెలుగు, ఉర్దూ, తమిళం, కన్నడ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, బెంగాలీ, అస్సామీ, ఒడియా, ఆంగ్ల భాషల్లో సమాచారం మీ గుప్పిట్లో ఉంటుంది. 27 ఇండిపెండెంట్ పోర్టల్స్​ ఒక్క భారత్​ యాప్​లోనే లభిస్తాయి.

సూటిగా..స్పష్టంగా

ప్రతి ఐదు నిమిషాలకు లైవ్ బులిటెన్ చొప్పున 24 గంటల పాటు ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో మీ అరచేతిలో ప్రత్యక్షమవుతుంది. టీవీ, పత్రిక మాధ్యమాల రెండింటి కలగలుపే ఈటీవీ భారత్​ ప్రత్యేకత. కేవలం 60 పదాలతోనే వార్త సారాంశం....పూర్తి కథనం టెక్ట్స్​, వీడియో రూపాల్లో లభిస్తుంది.

యాప్‌లోనే సమస్త సమాచారం

వార్తలు, ప్రముఖుల ఇంటర్వ్యూలు, నిపుణులతో చర్చలు, విశ్లేషణలతో పాటు క్షేత్రస్థాయి కవరేజీతో వినిపించే ప్రజల గొంతుకే ఈటీవీ భారత్​. రాజకీయం, క్రైమ్​, క్రీడ, సినిమా, బిజినెస్‌, లైఫ్​స్ట్లైల్​, ఫ్యాషన్‌, విద్య, సాహిత్యం, ఆధ్యాత్మికం, వంటలు, చిత్రమాలిక, వీడియోలు, దినవార ఫలాలు అన్నింటి సమాహారంగా అలరిస్తుంది.

లైక్‌ చేయండి... షేర్‌ చేయండి....!

మరింకెందుకు ఆలస్యం మీ స్నేహితులకు మీ ఆత్మీయులకు ఈటీవీ భారత్‌ యాప్‌ గురించి చెప్పండి. డౌన్​లోడ్​ చేసుకోండి... లైక్‌ చేయండి... షేర్‌ చేయండి....!

Last Updated : Mar 21, 2019, 8:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.