
Energy Swaraj Yatra : ఇంధన వనరుల వినియోగం వల్ల కలిగే నష్టాలు, సౌరశక్తితో కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ‘ఎనర్జీ స్వరాజ్’ పేరిట 11 ఏళ్ల బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు ఐఐటీ ముంబయి ఆచార్యుడు చేతన్‌సింగ్ సోలంకి. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో అక్కడి సీఎం శివరాజ్‌సింగ్ 2020, నవంబరు 26న ఈ యాత్రను ప్రారంభించారు. మధ్యప్రదేశ్, యూపీ, దిల్లీ, హరియాణా, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర మీదుగా 16 వేల కిలోమీటర్ల మేరకు సాగిన ఈ యాత్ర మంగళవారం తెలంగాణలోని ఆదిలాబాద్‌కు చేరుకుంది.
11 Yrs of Energy Swaraj Yatra : ఈ బస్సు పైకప్పుపై సౌరఫలకాలను బిగించారు. వాటి ద్వారా వెలువడే విద్యుత్తుతో బస్సు లోపలి దీపాలు, ఇతర పరికరాలను వినియోగిస్తున్నారు. ఉద్యోగానికి సెలవు పెట్టి మరీ స్వస్థలమైన భోపాల్‌లో ఈ యాత్ర చేపట్టిన చేతన్.. ఇప్పటివరకు 50 వేల మందికి అవగాహన కల్పించారు. యాత్రకు తన సొంత డబ్బును వెచ్చించడంతోపాటు స్నేహితులు, విద్యార్థుల ఆర్థిక సహకారం తీసుకుంటున్నారు. సౌరశక్తి ప్రయోజనాలపై ఇప్పటికే 7 పుస్తకాలు రాసిన చేతన్‌ను మధ్యప్రదేశ్ ప్రభుత్వం సౌరశక్తికి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. కోటి మందికి సౌరదీపాలు పంపిణీ చేసి, వాటి తయారీపై 10వేల మంది మహిళలకు శిక్షణ నిర్వహించిన ఆ ఆచార్యుడు 3 గిన్నిస్ బుక్ రికార్డులను సొంతం చేసుకోవడం విశేషం.

- ఇదీ చదవండి : గోవులపై కమలం ప్రేమ.. యూపీ ఎన్నికల్లో కలిసొచ్చేనా?