ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రణదివేనగర్‌లో మృతిచెందిన ఆవు, దాని దూడకు కాలనీవాసులు సంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. పోచమ్మ ఆలయానికి వదిలేసిన వీటిపై.. వీధికుక్కలు దాడి చేశాయి. ఆవు, దూడ తీవ్రంగా గాయపడి మృతి చెందాయి.
విషయం తెలుసుకున్న కాలనీవాసులంతా డబ్బులు జమ చేసుకొని.. డప్పు చప్పుళ్ల నడుమ వాటికి అంత్యక్రియలు నిర్వహించారు. గొయ్యి తవ్వి పూడ్చిపెట్టారు. మూగజీవాల పట్ల మానవత్వాన్ని చాటుకున్న వారిని పలువురు ప్రశంసించారు.
ఇదీ చూడండి: ఆ ఉద్యోగులకు భారీగా జీతాలు పెంపు!