నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవనంలో రాష్ట్ర ఉద్యోగ ఐక్యవేదిక సమావేశం జరిగింది. ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని ముఖ్యమంత్రి నెరవేర్చలేదని సంఘం నాయకులు ఆరోపించారు. ఉద్యోగ విరమణ వయసు పెంచుతామని మాటిచ్చిన సీఎం ఎన్నికల తర్వాత ఆ మాటే మరిచారని విమర్శించారు.
పీఆర్సీ అమలు, ఉద్యోగుల పదోన్నతులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. మార్చి 13న ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్టు తెలిపారు. విద్యా వ్యవస్థలో చాలా కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని వెంటనే పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని నేతలు డిమాండ్ చేశారు.