రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా తాజాలు, మాజీలు ఎవరొచ్చినా పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తామని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలకు మేలు చేసేదిగా ఉందని అభిప్రాయపడ్డారు.
జిల్లాకు ఫిట్ లైన్ మంజూరైనందున... 48 రైళ్లు జిల్లాకు రానున్నాయని వివరించారు. అధికార, ఇతర పార్టీ నేతలు కూడా తమ అధిష్ఠానంతో టచ్లో ఉన్నారని... ఎవరు వచ్చినా తాను అడ్డుకోబోమని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: తెరాస నేతల అండతో భూకబ్జాలు : బండి సంజయ్