Zomato, Swiggy, OYO Rooms Register Record Orders And Bookings On New Years Eve : నూతన సంవత్సర వేడుకల సందర్బంగా జొమాటో, స్విగ్గీ లాంటి ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు రికార్డ్ స్థాయిలో ఆర్డర్లను డెలివరీ చేశాయి.
జొమాటో టిప్సే రూ.97 లక్షలు!
జొమాటో ప్లాట్ఫామ్లో 2015 -2020 మధ్య ఎన్ని ఆర్డర్లు అయితే బుక్ అయ్యాయో, అన్ని ఆర్డర్లు ఒక్క 2023 డిసెంబర్ 31నే బుక్ కావడం విశేషం.
-
Fun fact: We’ve delivered almost as many orders on NYE 23 as we did on NYE 15, 16, 17, 18, 19, 20 combined 🤯
— Deepinder Goyal (@deepigoyal) December 31, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Excited about the future!
">Fun fact: We’ve delivered almost as many orders on NYE 23 as we did on NYE 15, 16, 17, 18, 19, 20 combined 🤯
— Deepinder Goyal (@deepigoyal) December 31, 2023
Excited about the future!Fun fact: We’ve delivered almost as many orders on NYE 23 as we did on NYE 15, 16, 17, 18, 19, 20 combined 🤯
— Deepinder Goyal (@deepigoyal) December 31, 2023
Excited about the future!
"2015 నుంచి 2020 వరకు ఎన్ని ఆర్డర్లు అయితే వచ్చాయో, అన్ని ఆర్డర్లు ఒక్క ఈ డిసెంబర్ 31నే రావడం విశేషం. ఇది మంచి భవిష్యత్‌ను సూచిస్తోంది."
- దీపేందర్ గోయెల్, జొమాటో సీఈఓ
సుమారుగా 3.2 లక్షల మంది జొమాటో డెలివరీ పార్టనర్లు ఈ ఆర్డర్లను బట్వాడా చేశారని కంపెనీ తెలిపింది. కంపెనీ ప్రకారం, అన్నింటి కంటే ఎక్కువగా మహారాష్ట్రలోనే ఆర్డర్లు బుక్ అయ్యాయి. కోల్‌కతాలో ఒక వ్యక్తి ఏకంగా 125 ఐటెమ్‌లను ఆర్డర్ చేశాడు. విశేషం ఏమిటంటే, జొమాటో డెలివరీ బాయ్స్‌కు ఈ ఒక్క రోజులోనే రూ.97 లక్షల మేరకు టిప్స్ లభించాయి.
స్విగ్గీ రికార్డ్ ఆర్డర్స్
స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ కూడా డిసెంబర్ 31న రికార్డ్ స్థాయిలో ఆర్డర్లను డెలివరీ చేసింది. వరల్డ్ కప్ ఫైనల్స్ జరిగినప్పుడు వచ్చిన ఆర్డర్లు కంటే, ఏకంగా 1.6 రెట్లు అధికంగా ఇయర్ ఎండ్ ఈవ్ ఆర్డర్లు వచ్చాయని స్విగ్గీ తెలిపింది.
"వరల్డ్ కప్ ఫైనల్స్ జరిగినప్పుడు వచ్చిన ఆర్డర్లు కంటే, అధికంగా ఇయర్ ఎండ్ ఈవ్ ఆర్డర్లు వచ్చాయి. దీనితో గత రికార్డులు అన్నీ చెదిరిపోయాయి."
- రోహిత్ కపూర్, స్విగ్గీ సీఈఓ
4.8 లక్షల బిర్యానీ ఆర్డర్లు
నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా ఒక్క హైదరాబాద్‌లోనే ఏకంగా 4.8 లక్షల బిర్యానీ ప్యాకెట్లు డెలివరీ చేసినట్లు స్విగ్గీ తెలిపింది. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే, ప్రతి నిమిషానికి 1244 ఆర్డర్లు వచ్చాయని స్పష్టం చేసింది. చివరి గంటలో సుమారుగా 10 లక్షల మంది స్విగ్గీ యాప్‌ను ఉపయోగించారని ఆ కంపెనీ సీఈఓ రోహిత్ కపూర్ తెలిపారు.
భారీ స్థాయిలో కండోమ్స్ ఆర్డర్
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సమయంలో ప్రతి గంటకు 1722 యూనిట్ల కండోమ్స్ ఆర్డర్లు వచ్చాయని స్విగ్గీ ఇన్స్టామార్ట్తెలిపింది.
కిరాణా సామాన్లు కూడా
స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో డిసెంబర్ 31న రెండు లక్షల కిలోల ఉల్లిపాయలు, 1.80 లక్షల కిలోల బంగాళా దుంపలు ఆర్డర్ చేశారు.
-
this year the numbers are almost 4 times higher. with 2,00,000 kilos of kaanda and 1,80,000 kilos of aloo stocked at @swiggyinstamart, uday shetty is spinning and shaking unable to control himself rn https://t.co/cVOmsKZf1n
— Swiggy (@Swiggy) December 31, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">this year the numbers are almost 4 times higher. with 2,00,000 kilos of kaanda and 1,80,000 kilos of aloo stocked at @swiggyinstamart, uday shetty is spinning and shaking unable to control himself rn https://t.co/cVOmsKZf1n
— Swiggy (@Swiggy) December 31, 2023this year the numbers are almost 4 times higher. with 2,00,000 kilos of kaanda and 1,80,000 kilos of aloo stocked at @swiggyinstamart, uday shetty is spinning and shaking unable to control himself rn https://t.co/cVOmsKZf1n
— Swiggy (@Swiggy) December 31, 2023
ఓయో రూమ్ బుకింగ్స్
నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా ఓయో రూమ్ బుకింగ్స్ కూడా రికార్డ్ స్థాయిలో జరిగాయి. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం 37 శాతం (6.2 లక్షల) రూమ్ బుకింగ్స్ జరిగాయి. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే, కేవలం డిసెంబర్ 30, 31 తేదీల్లోనే ఏకంగా 2.3 లక్షల ఓయో రూమ్స్ బుక్ అయ్యాయి. ఇక్కడ విశేషం ఏమిటంటే, హిందూ పవిత్ర స్థలమైన అయోధ్యలో గతేడాదితో పోలిస్తే 70 శాతం అధికంగా, గోవాలో 50%, నైనిటాల్లో 60% ఎక్కువగా ఓయో రూమ్స్ బుక్ అయ్యాయి.
రూపాయిన్నర తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
సైబర్ మోసానికి గురయ్యారా? సింపుల్‌గా కంప్లైంట్ చేయండిలా!
ఈ కొత్త ఏడాదిలో మీ ఆర్థిక లక్ష్యం నెరవేరాలా? ఈ టాప్-25 టిప్స్ మీ కోసమే!