ETV Bharat / business

Upcoming Cars Under 15 Lakhs India : రూ.15 లక్షల్లో కారు కొనాలా? త్వరలో రానున్న 5 టాప్ మోడల్స్ ఇవే..

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 27, 2023, 4:51 PM IST

Upcoming Cars Under 15 Lakhs India 2023 : రూ.15 లక్షల లోపు కారు కొనాలని చూస్తున్నారా? తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కావాలని కోరుకుంటున్నారా? అయితే త్వరలో మార్కెట్​లోకి విడుదలయ్యే ఈ కార్ల గురించి తెలుసుకోండి.

upcoming-cars-under-15-lakhs-india-2023-and-latest-upcoming-cars-in-india
భారత్​లో రూ 15 లక్షల లోపు కార్లు

Upcoming Cars Under 15 Lakhs India 2023 : దేశంలో ఎక్కువగా ఉన్న మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని.. వారికి అందుబాటులో ధరలు ఉండేలా కార్లను రూపొందిస్తున్నాయి పలు కంపెనీలు. కొత్త మోడల్​ కార్లను ఎక్కువ ఫీచర్లతో తక్కువ ధరల్లో తీసుకువస్తున్నాయి. ఇలాంటి కార్లనే 2023 ముగిసేనాటికి మర్కెట్​లోకి ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి కంపెనీలు. రూ.15 లక్షల లోపే వీటి ధరలను నిర్ణయించాయి తయారీ సంస్థలు. రాబోయే రోజుల్లో టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్​ , టయోటా రూమియన్​ ఇంకా మరికొన్ని కార్లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్​..
Tata Nexon Facelift Price : నెక్సాన్​ కారుకు లోపల, బయట కొన్ని మార్పులు చేసి.. నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్​ను తీసుకువచ్చింది కంపెనీ. 2023 ఆటో ఎక్స్​పోలో ఈ కారును టాటా కంపెనీ ప్రదర్శనకు ఉంచింది. నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ 1.2-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్​ల సామర్థ్యంతో తయారు చేసింది కంపెనీ. ఐదు గేర్ల మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ సౌకర్యం ఈ కారులో ఉంటుంది.

upcoming-cars-under-15-lakhs-india-2023-and-latest-upcoming-cars-in-india
టాటా నెక్సాన్

టయోటా రూమియన్​..
Toyota Rumion Launch Date : టయోటా రూమియన్​ ధర దాదాపు రూ.9 లక్షల నుంచి రూ.13 లక్షల మధ్యలో ఉంటుంది. టయోటా రూమియన్​ను మారుతి సుజుకి రీబ్యాడ్జ్డ్ వెర్షన్​గా తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది.
1.5 లీటర్లు, నాలుగు సిలిండర్ల మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌తో సామర్థ్యంతో.. ఈ కారును తయారు చేసింది టయోటా కంపెనీ. ఆటో, మాన్యువల్ ట్రాన్స్మిషన్​ సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. సీఎన్​జీ వేరియెంట్​ కూడా ఈ మోడల్​లో అందుబాటులో ఉంది.

టయోటా రూమియన్

హోండా ఎలివేట్..
Honda Elevate Price in India 2023 : దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ.11 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. కచ్చితమైన ధరలు మాత్రం సెప్టెంబర్​ 4న వెల్లడి కావచ్చు. 1.5 లీటర్ల డీజిల్ ఇంజిన్ సామర్థంతో ఈ హోండా ఎలివేట్ కారును తయారు చేసింది సంస్థ. ఇందులో ఆరు గేర్ల ఆటో ట్రాన్స్మిషన్, కంటిన్యూయస్​ వేరియబుల్ ట్రాన్స్మిషన్​ గేర్ల సౌకర్యం ఉంటుంది.

హోండా ఎలివేట్

సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్..
Citroen c3 Aircross Price : 5 సీట్ల సామర్థ్యంతో తీసుకువచ్చిన సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్.. ప్రారంభ ధర దాదాపు రూ.10 లక్షలు ఉండే అవకాశం ఉంది. ఏడు సీట్ల సామర్థ్యంతో కూడా ఈ మోడల్​ కారు అందుబాటులోకి వస్తుంది. 1.2 టర్బో పెట్రోల్​ ఇంజిన్ సామర్థ్యంతో దీన్ని రూపొందించింది కంపెనీ. ఇందులో మాన్యువల్ ట్రాన్స్మిషన్​ సౌకర్యం మాత్రమే ఉంది.

సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్

టాటా పంచ్​ ఈవీ..
Tata Punch Ev Price : ఈ కారును చాలా సార్లు టెస్ట్​ డ్రైవ్​ చేసింది టాటా కంపెనీ. 2023 చివర్లో ఇది మార్కెట్​లోకి విడుదలయ్యే అవకాశం ఉంది. టాటా పంచ్​ ఈవీని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. దాదాపు 350 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. టాటా టియాగో ఈవీ, టాటా టిగోర్ ఈవీ కార్ల కంటే ఇది మెరుగ్గా ఉండొచ్చనే అభిప్రాయాలు మార్కెట్​లో ఉన్నాయి. టాటా పంచ్​ ఈవీ కారు జిప్‌ట్రాన్ టెక్నాలజీపై ఆధారపడి పనిచేస్తుంది.

టాటా పంచ్​

Hero New Bike Launch : హీరో​ '2023 గ్లామర్' బైక్​​ లాంఛ్​.. ఫీచర్స్ అదుర్స్​.. ధర ఎంతంటే?

TVS X Electric Scooter Launch : స్టన్నింగ్​ లుక్​తో టీవీఎస్ ఎలక్ట్రిక్​ బైక్​.. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 140 కి.మీ మైలేజ్​..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.