ETV Bharat / business

UPI ద్వారా పేమెంట్ చేస్తే బోనస్! కేంద్రం కొత్త స్కీమ్.. వారికి మాత్రమే​!! - National Export Society

గూగుల్​పే, ఫోన్​పే ద్వారా మనీ ట్రాన్స్​ఫర్ చేస్తే ఒకప్పుడు భారీగా క్యాష్​బ్యాక్​లు వచ్చేవి గుర్తుందా? ఇప్పుడు రూపే డెబిట్ కార్డ్, బీమ్ యూపీఐ లావాదేవీలు ప్రోత్సహించేందుకు కేంద్రం అలాంటి విధానమే అనుసరించే అవకాశముంది. ఇందుకోసం రూ.2,600కోట్లతో కొత్త పథకం అమలుకు పచ్చజెండా ఊపింది కేంద్ర మంత్రివర్గం.

cabinet approves rupay debit card scheme
యూపీఐ వినియోగదారులకు గుడ్​ న్యూస్
author img

By

Published : Jan 11, 2023, 5:57 PM IST

యూపీఐ వినియోగదారులకు కేంద్రం గుడ్​ న్యూస్ తెలిపింది. రూపే డెబిట్​ కార్డు, లేదా తక్కువ విలువ కలిగిన బీమ్ యూపీఐ​ లావాదేవీలను పోత్సహించడానికి కొత్త స్కీమ్​ను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం రూ. 2,600 కోట్ల వ్యయంతో ఆ పథకానికి ఆమోదం తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద బ్యాంకులకు ఆర్థికసాయాన్ని అందిస్తుంది. తక్కువ మొత్తంలో డిజిటల్​ చెల్లింపులు చేసేవారిని ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం. "భారత్​ మరింత బలమైన డిజిటల్ చెల్లింపు వ్యవస్థగా వృద్ధి చెందడానికి ఈ పథకం సహాయపడుతుంది. వినియోగదారులు వ్యాపారులకు చేసే.. రూ. 200 కంటే తక్కువ విలువ కలిగిన చెల్లింపులను ఈ పథకం పోత్సహిస్తుంది. యూపీఐ లైట్​, యూపీఐ123పే ద్వారా డిజిటల్​ చెల్లింపులను ప్రమోట్​ చేస్తుంది. ఈ పథకంతో భారత్​ డిజిటల్ చెల్లింపుల విషయంలో మరో ముందడుగు వేయనుంది." అని కేంద్రప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

రైతుల కోసం మూడు కొత్త సహకార సంఘాలు..
సేంద్రియ ఉత్పత్తులు, విత్తనాలు, ఎగుమతులను పోత్సహించడానికి.. 3 కొత్త సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. నేషనల్ ఎక్స్‌పోర్ట్ సొసైటీ, నేషనల్ కోఆపరేటివ్ సొసైటీ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్, నేషనల్ లెవల్ మల్టీ-స్టేట్ సీడ్ కోఆపరేటివ్ సొసైటీల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.