ETV Bharat / business

కొత్త బైక్ కొన్న ధోనీ.. తక్కువ ధరలో అదిరే ఫీచర్లు.. మీరూ కొంటారా? - టీవీఎస్ రోనిన్ ఫీచర్లు

ధోనీకి బైక్​లంటే ఇష్టమని చాలా మందికి తెలుసు. మార్కెట్​లోకి వచ్చిన కొత్త బైక్​లను ఆయన తరచుగా కొనుగోలు చేస్తూ ఉంటారు. తాజాగా ధోనీ.. టీవీఎస్​ కంపెనీ నుంచి ఓ స్పెషల్​ బైక్​ కొన్నారు. ధోనీ కొన్న బైక్ అంటే అదేదో రూ.లక్షల్లో ఉంటుందని అనుకోకండి. అది సామాన్యులకు అందుబాటులో ఉండే ధరలోనే ఉంది. మరి ధోని కొన్న ఆ బైక్​ ప్రత్యేకతలు తెలుసుకుందామా!

tvs-ronin-225-review-ms-dhoni-takes-delivery-of-tvs-ronin
టీవీఎస్ రోనిన్ 225 రివ్యూ
author img

By

Published : Feb 18, 2023, 6:54 PM IST

భారత​ క్రికెట్​ టీం మాజీ కెప్టెన్​ మహేంద్ర సింగ్​ ధోనీ.. మరో బైక్​ను కొనుగోలు చేశారు. సరికొత్త ఫీచర్లతో వచ్చిన టీవీఎస్ బైక్​ను.. తన గ్యారేజీలోకి అదనంగా చేర్చారు. అయితే ధోనీ ఇప్పటి వరకు ఎన్నో ఖరీదైన బైక్​లను కొనుగోలు చేస్తూ వచ్చారు. ఈ సారి మాత్రం తక్కువ బడ్జెట్​లో ఉన్న బైక్​ను కొన్నారు. సామాన్యులకు అందుబాటులోనే ధర ఉందని ఈ బైక్​ తయారీదారులు చెబుతున్నారు. మరి ఆ బైక్​ ఎంటో! దాని విశేషాలేంటో తెలుసుకుందాం.

టీవీఎస్ మోటార్ కంపెనీకి చెందిన రోనిన్ మోడల్​ బైక్​ను ధోనీ కొనుగోలు చేశారు. కంపెనీ ప్రీమియం బిజినెస్ హెడ్ విమల్ సుంబ్లీ.. ధోనీకి బైక్​ తాళంచెవి అందజేశారు. కాగా హోండా సీబీ350 ఆర్​ఎస్​, యెజ్డీ స్క్రాంబ్లర్‌, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్-350 వంటి ఖరీదైన బైక్​లతో.. ఈ టీవీఎస్​ రోనిన్ బైక్​ పోటీపడుతుంది. తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది.

tvs-ronin-225-review-ms-dhoni-takes-delivery-of-tvs-ronin
టీవీఎస్ రోనిన్

టీవీఎస్​ రోనిన్-225.9..
2022 జూలైలో మొదటి సారిగా ఈ బైక్​ లాంచ్​ అయింది. మొత్తం ఆరు కలర్లు, మూడు మోడళ్లలో ఈ బైక్​ అందుబాటులో ఉంది. ఆ కలర్లు.. 1. లైట్​నింగ్ బ్లాక్ 2. డెల్టా బ్లూ 3. మాగ్మా రెడ్ 4. స్టార్‌గేజ్ బ్లాక్ 5. గెలాక్సీ గ్రే 6. డాన్ ఆరెంజ్.

టీవీఎస్​ రోనిన్​ ఇంజిన్​ ప్రత్యేకతలు..
టీవీఎస్​ రోనిన్ 225.9 సీసీ ఇంజన్​ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ బైక్​.. 7,750 ఆర్‌పీఎమ్ వద్ద 20.04 బీహెచ్‌పీ పవర్​ను.. 3,750 ఆర్‌పిఎమ్ వద్ద 19.93 ఎన్ఎమ్ టార్క్​ను ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్ల బాక్స్‌ జతచేసి ఉంది.

సాంకేతిక హంగులతో కొత్తగా బైక్​ రూపకల్పన..

  • ఈ బైక్​లో బ్లూటూత్ సౌకర్యం ఉంది. కాబట్టి స్మార్ట్​ఫోన్​తో దీన్ని కనెక్ట్​ చేసుకోవచ్చు.
  • మెస్సేజ్​, కాల్ అలెర్ట్​ ఫంక్షన్ కూడా ఉంది. దీంతో రైడింగ్​లో ఉండగానే కాల్స్​ను స్వీకరించవచ్చు లేదా కట్​ చేయవచ్చు.
  • ఇందులో టర్న్ బై టర్న్ నావిగేషన్ సిస్టమ్​ సైతం ఉంది.
  • మొబైల్స్​కు ఉన్నట్లుగానే ఈ బైక్​లో​ వాయిస్ అసిస్టెంట్స్​​ ఫీచర్​ ఉంది.
  • ఈ బైక్​ను పట్టణాల్లోనూ, వర్షంలోనూ సులువుగా డ్రైవ్​ చేయవచ్చు. అలాంటి మోడ్స్​ను ఈ బైక్​ కలిగి ఉంది.
  • బైక్​కు​ సింగిల్-పీస్ సీట్ అమర్చి ఉంది.

అదేవిధంగా ఈ టీవీఎస్ రోనిన్ బైక్​ మంచి సస్పెన్షన్ సెటప్ కలిగి ఉంది. దీని ముందు భాగంలో 41 ఎమ్​ఎమ్​ అప్‌సైడ్- డౌన్ ఫ్రంట్ ఫోర్క్‌లను, వెనుక భాగంలో ప్రీ-లోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ సెటప్ ఉంది. కాబట్టి రోడ్డు ఎలా ఉన్న సులువుగా రైడ్​ చేయవచ్చు. ఈ బైక్​.. 17 అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది. ఈ టైర్లను ముందు, వెనుక డ్యూయల్-పర్పస్​గా వాడుకోవచ్చు. టీవీఎస్​ రోనిన్-225.9 ఎక్స్​ షోరూం ధర రూ. 1.49లక్షల నుంచి 1.71 లక్షల వరకు ఉంటుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.