ETV Bharat / business

Tata Upcoming Cars 2023 : జోరుమీదున్న టాటా మోటార్స్​.. వరుసగా 7 కార్ల లాంఛింగ్​కు​ సన్నాహాలు! - హర్రియర్​ ఈవీ ఫేస్​లిఫ్ట్

Tata Upcoming Cars 2023 : ఇండియన్​ ఆటోమొబైల్​ దిగ్గజం, ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ మంచి జోరు మీద ఉంది. ఈ ఏడాది చివరి నాటికి 3.. వచ్చే ఏడాది ప్రారంభంలో 4 సరికొత్త ​కార్లను లాంఛ్​ చేయనున్నట్లు ప్రకటించింది. మరి ఆ నయా టాటా కార్లపై మనమూ ఓ లుక్కేద్దామా?

Tata Upcoming Cars 2023
Tata Latest Cars 2023
author img

By

Published : Aug 12, 2023, 10:03 AM IST

Tata Upcoming Cars 2023 : ప్రముఖ ఆటోమొబైల్​ కంపెనీ టాటా మోటార్స్ కార్ల తయారీలో మంచి జోరును కనబరుస్తోంది. రానున్న రెండేళ్లలో ఏకంగా 7 సరికొత్త​ కార్లను ఇండియన్​ మార్కెట్​లోకి విడుదల​ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది చివరి నాటికి 3 వేరియంట్లు, వచ్చే ఏడాది ప్రారంభంలో 4 ఎలక్ట్రిక్​ కార్లను (Tata Latest Cars 2023) లాంఛ్​ చేయనున్నట్లు టాటా సన్స్​ కంపెనీ ఛైర్మన్​ ఎన్​.చంద్రశేఖరన్​ తెలిపారు. కాగా, ఈ ఏడాదిలో విడుదల కానున్న 3 టాటా ఎస్​యూవీలు ఏమిటంటే.. నెక్సాన్​, సఫారీ, హారియర్.

టాటా నెక్సాన్​
Tata Nexon Facelift 2023 : త్వరలో టాటా మోటార్స్​ లాంఛ్ చేయనున్న ఎస్​యూవీల్లో టాటా నెక్సాన్​ ఫేస్​లిఫ్ట్ వెర్షన్ అత్యంత ప్రముఖమైనదిగా చెప్పవచ్చు. ఈ కాంపాక్ట్ ఎస్​యూవీలో భారీ ఎత్తున డిజైన్ మార్పులు చేశారు. ముఖ్యంగా 2023 ఆటో ఎక్స్​పోలో ప్రదర్శించిన కర్వ్​ ఐసీఈ విధానం (Curve ICE Concept)లో ఆకట్టుకునే విధంగా డిజైన్​ చేశారు. అంతేకాకుండా సరికొత్తగా 10.25 అంగుళాల సైజులో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్​ను ఈ​ కారులో అమర్చారు. పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్​తో పాటు బ్యాక్‌లిట్ లోగోతో కూడిన 2 స్పోక్ స్టీరింగ్ వీల్‌తో కొత్త లేఅవుట్​ను ఇందులో గమనించవచ్చు. మొత్తంగా క్యాబిన్​ లోపల విస్తృత మార్పులు చేసుకొని కార్​ లవర్స్​ ముందుకు రానుంది Tata Nexon Facelift.

ఫీచర్లు..

  • సన్​రూఫ్​
  • టచ్​-బేస్డ్​ ఏసీ కన్సోల్​
  • ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌లు
  • 360 డిగ్రీల పార్కింగ్​ కెమెరా
  • సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్‌లు
  • 1.2 లీటర్ టీజీడీఐ పెట్రోల్ ఇంజిన్
  • 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

ఈ నెక్సాన్​ అప్​డేటెడ్​​ ఎస్​యూవీ 125 bhp పవర్​, 225 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే 1.5 లీటర్​ టర్బో డీజిల్​ వేరియెంట్​లోనూ అచ్చంగా ఇలాంటి ఫీచర్లే ఉండనున్నాయి. పలు మీడియా కథనాల ప్రకారం ఈ నెలలోనే Tata Nexon Facelift లాంఛ్​ జరిగే అవకాశం ఉంది.

టాటా సఫారీ, హారియర్​​ ఫేస్‌లిఫ్ట్..
Tata Harrier And Safari Facelift 2023 : టాటా సఫారీ, హారియర్​ అప్​డేటెడ్​​ వెర్షన్​ల ఫేస్​లిఫ్ట్​ మోడళ్లు కూడా ఈ ఏడాది విడుదల కానున్నాయి. ఇప్పటికే ట్రయల్​ రన్​ను పూర్తి చేసుకున్న ఈ రెండు ఎస్​యూవీలు సరికొత్త అప్​డేట్లతో కారు లవర్స్​ను ఖుషీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఫ్రంట్ ఫాసియా 2023 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన హారియర్​ ఈవీకి అనుగుణంగా దీని డిజైన్​ను తీర్చిదిద్దారు.

ఫీచర్లివే​..

  • న్యూ గేర్ సెలెక్టర్
  • ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
  • సింగిల్-పీస్ LED DRL
  • అప్​డేటెడ్​​ సెంటర్ కన్సోల్​
  • వెర్టికల్​ ఎల్​ఈడీ హెడ్‌ల్యాంప్స్​
  • టచ్-బేస్డ్ హెచ్‌వీఏసీ కంట్రోల్స్
  • ఫోర్-స్పోక్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్
  • 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్

ఫీచర్ల పరంగా లెవెల్ 2 ADASను ఈ రెండు (Tata Harrier And Safari Facelift) ఎస్​యూవీల్లో ఒక పెద్ద అప్‌గ్రేడ్​గా చెప్పుకోవచ్చు. మిగిలిన కొన్ని చిన్న చిన్న ఫీచర్​లను రివిజన్‌ చేసే అవకాశం ఉంది. 2.0-లీటర్ క్రయోటెక్ డీజిల్ ఇంజన్, 1.5-లీటర్ టర్బో పెట్రోల్​ వేరియెంట్లు త్వరలోనే లాంఛ్​ కానున్నాయి.

2024లో 4 ఈవీలు..
Tata Upcoming Cars 2024 : మరోవైపు 2024 మొదటి త్రైమాసికంలో 4 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీలను (Tata Latest Electric Cars 2024) భారత మార్కెట్​లోకి విడుదల చేసేందుకు ప్లాన్​ చేస్తున్నట్లు సంస్థ ఛైర్మన్​ తెలిపారు. ఇందులోని ఒక ఈవీలో ఈ ఏడాది విడుదల కానున్న టాటా నెక్సాన్ అప్​డేటెడ్​​ వర్షెన్​లో ఉండే ఫేస్​లిఫ్ట్​ ఫీచర్సే ఉండనున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో లాంఛ్​ కానున్న కొత్త ఈవీలు.. నెక్సాన్​ ఈవీ ఫేస్​లిఫ్ట్, పంచ్​ ఈవీ, హారియర్​​ ఈవీ, కర్వ్​ ఈవీ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.