Subrata Roy Dead : సహారా గ్రూప్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ సుబ్రతా రాయ్ కన్నుమూశారు. మంగళవారం రాత్రి గుండెపోటుతో ఆయన మరణించినట్లు కంపెనీ వెల్లడించింది. సుబ్రతా రాయ్ చాలా కాలంగా మెటా స్టాటిక్ కేన్సర్, హై బీపీ, మధుమేహంతో బాధపడుతున్నారు. ఆదివారం పరిస్థితి విషమించడం వల్ల ముంబయిలోని కోకిలా బెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్ అండ్ మెడికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరారని.. అక్కడే చికిత్స పొందుతూ మరణించారని కంపెనీ తెలిపింది. సుబ్రతారాయ్ మృతితో సహారా ఇండియా పరివార్ శోకసముద్రంలో మునిగిపోయిందని పేర్కొంది.
-
"It is with profound sadness that Sahara India Pariwar informs the demise of our Hon'ble 'Saharasri' Subrata Roy Sahara, Managing Worker and Chairman, Sahara India Pariwar," reads the press statement by Sahara India Pariwar. pic.twitter.com/gklwFOlT67
— Press Trust of India (@PTI_News) November 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">"It is with profound sadness that Sahara India Pariwar informs the demise of our Hon'ble 'Saharasri' Subrata Roy Sahara, Managing Worker and Chairman, Sahara India Pariwar," reads the press statement by Sahara India Pariwar. pic.twitter.com/gklwFOlT67
— Press Trust of India (@PTI_News) November 14, 2023"It is with profound sadness that Sahara India Pariwar informs the demise of our Hon'ble 'Saharasri' Subrata Roy Sahara, Managing Worker and Chairman, Sahara India Pariwar," reads the press statement by Sahara India Pariwar. pic.twitter.com/gklwFOlT67
— Press Trust of India (@PTI_News) November 14, 2023
Subrata Roy Death News : 1948 జూన్ 10న బిహార్‌లోని అరారియాలో జన్మించిన రాయ్ గోరఖ్‌పూర్‌లోని గవర్నమెంట్ టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. ఆర్థిక ఒత్తిళ్లలో ఉన్న చిట్‌ఫండ్ కంపెనీ సహారా ఫైనాన్స్‌ను 1976లో కొనుగోలు చేసిన రాయ్ 1978 కల్లా దానిని సహారా ఇండియా పరివార్‌గా తీర్చిదిద్దారు. ఆ తర్వాత ఆర్థిక, మీడియా, స్థిరాస్తి, ఆతిథ్య రంగాలకు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు.
-
#WATCH | Maharashtra | Outside visuals from Mumbai's Kokilaben Dhirubhai Ambani Hospital & Medical Research Institute.
— ANI (@ANI) November 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Sahara Group Managing Worker and Chairman Subrata Roy passed away on Tuesday due to cardiorespiratory arrest pic.twitter.com/7QQWHMpHqU
">#WATCH | Maharashtra | Outside visuals from Mumbai's Kokilaben Dhirubhai Ambani Hospital & Medical Research Institute.
— ANI (@ANI) November 14, 2023
Sahara Group Managing Worker and Chairman Subrata Roy passed away on Tuesday due to cardiorespiratory arrest pic.twitter.com/7QQWHMpHqU#WATCH | Maharashtra | Outside visuals from Mumbai's Kokilaben Dhirubhai Ambani Hospital & Medical Research Institute.
— ANI (@ANI) November 14, 2023
Sahara Group Managing Worker and Chairman Subrata Roy passed away on Tuesday due to cardiorespiratory arrest pic.twitter.com/7QQWHMpHqU
పెరోల్‌పై ఉండగానే మృతి
Subrata Roy News : ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆ గ్రూప్ 2014 నుంచి సవాళ్లను ఎదుర్కొంది. మదుపర్ల నుంచి సేకరించిన రూ.62,600 కోట్ల నగదును రిఫండ్ చేయాల్సిందిగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కోరినప్పటికీ అందులో విఫలం కావడం వల్ల సుప్రీం కోర్టు ఆదేశాల మధ్య రాయ్ తిహార్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. పెరోల్‌పై ఉంటున్న రాయ్ మంగళవారం కన్నుమూశారు.
సుబ్రతా రాయ్ మృతిపై ప్రముఖుల సంతాపం
Subrata Roy Passed Away : సుబ్రతా రాయ్ మృతి పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సుబ్రతా రాయ్ మరణం ఉత్తర్ ప్రదేశ్‌తో పాటు దేశానికి తీరని లోటు అని చెప్పారు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్. వేలాది మందికి సహాయం చేసిన ఆయన మరణం భాదాకరమని ట్వీట్ చేశారు. క్రీడా ప్రేమికుడు సుబ్రతా రాయ్ మరణం భాదాకరమని మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అన్నారు.