ETV Bharat / business

మార్కెట్లకు నష్టాలు.. సెన్సెక్స్​ 460 పాయింట్లు డౌన్ - ఎన్ఎస్​ఈ నిఫ్టీ

Stock Market Today: భారత స్టాక్​ మార్కెట్లు నష్టాలను నమోదు చేశాయి. బ్యాంక్​, పవర్, ఆయిల్​, క్యాపిటల్​ గూడ్స్​ షేర్లు నష్టాలను నమోదు చేయడం మార్కెట్​పై తీవ్ర ప్రభావం చూపింది.

stock market live
స్టాక్ మార్కెట్లు
author img

By

Published : Apr 29, 2022, 3:54 PM IST

Stock Market Today: స్టాక్​ మార్కెట్లు మళ్లీ నష్టాల్లో ముగిశాయి. గత సెషన్​లో పుంజుకున్న స్టాక్​మార్కెట్లు శుక్రవారం నష్టాలను నమోదు చేశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 460 పాయింట్లు కోల్పోయి 57,060 వద్ద స్థిరపడగా.. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 142 పాయింట్లు నష్టపోయి 17,102కు చేరుకుంది.

తీవ్ర ఒడుదొడుకుల మధ్య 57,817 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్​ ఒక దశలో 57వేల దిగువకు చేరుకుంది. కనిష్ఠంగా 56,902... గరిష్ఠంగా 57,975 పాయింట్లను నమోదు చేసింది. మరోవైపు నిఫ్టీలో కూడా ట్రేడింగ్​ ఒడుదొడుకులను ఎదుర్కొంది. 17,329 వద్ద ప్రారంభమైన నిఫ్టీ.. గరిష్ఠంగా 17,377కు చేరుకుంది. కానీ మార్కెట్లు ముగిసే సమయానికి తీవ్ర నష్టాలను ఎదుర్కొంది. కనిష్ఠంగా 17,053 పాయింట్లకు పడిపోయింది.

  • బ్యాంక్​, ఆయిల్​ అండ్​ గ్యాస్​, రియల్​ ఎస్టేట్​, పీఎస్​యూ బ్యాంక్, పవర్​, క్యాపిటల్​ గూడ్స్​ సూచీలు నష్టాలను నమోదు చేయడం మార్కెట్​పై ప్రభావం చూపింది. ఈ సూచీలన్నీ 1-2 శాతం నష్టాన్ని నమోదు చేశాయి.
  • హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, సన్​ఫార్మా, టాటా స్టీల్, కొటక్​బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ లైఫ్​ షేర్లు లాభాలను నమోదు చేశాయి.
  • యాక్సిస్​ బ్యాంక్​, కోల్​ ఇండియా, అదానీ పోర్ట్స్​, విప్రో, ఓఎన్​జీసీ షేర్లు నష్టాలను నమోదు చేశాయి.

ఇదీ చూడండి : త్వరలో ప్రభుత్వ ఈ-కామర్స్ ప్లాట్​ఫాం.. అమెజాన్, ఫ్లిప్​కార్ట్​​కు గట్టి పోటీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.