ETV Bharat / business

కేంద్రం గుడ్​న్యూస్.. పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు పెంపు.. వాటికి మాత్రమే!

Small Savings interest rates : పొదుపు పథకాలపై చెల్లించే వడ్డీని పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు తెలిపింది. ఏఏ పథకాలకు వడ్డీ రేట్లు పెరిగాయో తెలుసుకుందాం పదండి.

small-savings-interest-rates-for-2023-july

author img

By

Published : Jun 30, 2023, 7:04 PM IST

Small Savings interest rates : ఎంపిక చేసిన చిన్న పొదుపు మొత్తాలపై వడ్డీ రేట్లను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వివిధ పథకాల్లో భాగంగా చేసే పొదుపులపై 0.3 శాతం వరకు వడ్డీ పెంచింది. బ్యాంకుల్లో ఉన్న అధిక వడ్డీ రేట్లకు అనుగుణంగా చిన్న సేవింగ్స్​పై వడ్డీ పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. జులై- సెప్టెంబర్ త్రైమాసికానికి ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయని తెలిపింది.

అత్యధికంగా దీనికే..
ఐదేళ్ల వ్యవధి కలిగిన రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా 0.3 శాతం వడ్డీ పెరిగినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ డిపాజిట్ హోల్డర్లు 6.5 శాతం వడ్డీ పొందుతారని వెల్లడించింది. ఇదివరకు ఐదేళ్ల ఆర్​డీలపై వడ్డీ 6.2 శాతంగా ఉంది.

  • ఏడాది కాలవ్యవధి ఉన్న టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 0.1 శాతం పెరిగింది.
  • తాజా మార్పుల తర్వాత ఏడాది వ్యవధి ఉన్న పోస్టాఫీస్​ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 6.8 శాతం నుంచి 6.9 శాతానికి పెరిగింది.
  • రెండేళ్ల కాలపరిమితి కలిగిన టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 0.1 శాతం పెరిగి 7 శాతానికి చేరింది.
  • మూడేళ్లు, ఐదేళ్ల టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో మార్పు లేదు.
  • ప్రస్తుతం మూడేళ్ల టర్మ్ డిపాజిట్లకు ఏడు శాతం.. ఐదేళ్ల టర్మ్ డిపాజిట్లకు 7.5 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు.
  • పీపీఎఫ్(పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్), సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ రేట్లలోనూ ఎలాంటి మార్పులూ లేవు. పీపీఎఫ్​పై 7.1 శాతం, సేవింగ్స్ డిపాజిట్లపై 4 శాతం వడ్డీ చెల్లించనున్నారు.
  • జాతీయ సేవింగ్స్ సర్టిఫికేట్స్ (ఎన్ఎస్​సీ)పై వడ్డీ రేట్లలోనూ ఎలాంటి మార్పు లేకుండా.. 7.7 శాతంగా కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది.
  • సుకన్య సమృద్ధి యోజన కింద చేసే సేవింగ్స్​పై 8 శాతం వడ్డీ ఇస్తుండగా.. దాన్ని అలాగే కొనసాగించాలని నిర్ణయించింది.
  • సీనియర్ సిటిజన్ల సేవింగ్స్ పథకంపై 8.2 శాతం, కిసాన్ వికాస్ పత్ర(కేవీపీ)పై 7.5 శాతంగా వడ్డీ రేట్లను కొనసాగిస్తున్నట్లు కేంద్రం తెలిపింది.
  • మంత్లీ ఇన్​కమ్ స్కీమ్​ వడ్డీ రేట్లలోనూ ఎలాంటి మార్పు లేదు. ఈ పథకానికి 7.4 శాతం వడ్డీ రేటు కొనసాగనుంది.

చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ఇచ్చే వడ్డీ రేట్లను ప్రతి త్రైమాసికానికి ఒకసారి కేంద్రం ప్రకటిస్తుంటుంది. గత రెండు త్రైమాసికాల్లోనూ వడ్డీ రేట్లను పెంచింది కేంద్రం. ఆర్​బీఐ ద్రవ్యపరపతి విధానాలకు అనుగుణంగా ఈ వడ్డీ రేట్లలో మార్పులు ఉంటాయి. మే నుంచి బెంచ్​మార్క్ లెండింగ్ రేట్లను 2.5 శాతం నుంచి 6.5 శాతానికి పెంచింది ఆర్​బీఐ. దీంతో బ్యాంకులు సైతం తమ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం సైతం వడ్డీ రేట్లు పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.