ETV Bharat / business

చిన్న రుణాలకు మళ్లీ గిరాకీ.. త్వరలో 'కొవిడ్‌' ముందు నాటి స్థితి.. బ్యాంకులు రెడీ!

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సూక్ష్మ రుణాలకు మళ్లీ గిరాకీ పెరుగుతోంది. వ్యాపార కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు అధికం అవుతున్నాయనడానికి దీన్ని సంకేతంగా భావిస్తున్నారు నిపుణులు. అయితే సూక్ష్మ రుణాలకు గిరాకీ పెరుగుతున్నందున, దానికి తగ్గట్లుగా ఎంఎఫ్‌-ఎన్‌బీఎఫ్‌సీలు, బ్యాంకులు సన్నద్ధమవుతున్నాయి. అధిక మొత్తాలు, ఎక్కువ మందికి రుణాలు ఇవ్వటానికి సిద్ధపడుతున్నాయి.

small loans
small loans
author img

By

Published : Oct 19, 2022, 7:04 AM IST

Small Loans Demand: సూక్ష్మ రుణాలకు మళ్లీ గిరాకీ పెరుగుతోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వ్యాపార కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు అధికం అవుతున్నాయనడానికి దీన్ని సంకేతంగా భావిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో, క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంతో పోలిస్తే సూక్ష్మ రుణ సంస్థల, స్థూల రుణాల మొత్తం (గ్రాస్‌ లోన్‌ పోర్ట్‌ఫోలియో- జీఎల్‌పీ) 17 శాతం పెరిగి, రూ.2.9 లక్షల కోట్లకు చేరినట్లు క్రిఫ్‌ హైమార్క్‌ నివేదిక వెల్లడించింది.

కొత్త రుణాల మంజూరు 90 శాతం పెరిగినట్లు, అందువల్ల జీఎల్‌పీలో ఆకర్షణీయమైన వృద్ధి కనిపిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాక సూక్ష్మ రుణాలు అడిగే వారి సంఖ్య ఎంతో అధికంగా ఉన్నట్లు వివరించింది. రుణాలు అడిగే వారి సంఖ్య 15- 20 శాతం పెరుగుతోందని పేర్కొంది. పశ్చిమ బెంగాల్‌, ఉత్తర ప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో సూక్ష్మ రుణాల మంజూరు అధికంగా ఉన్నట్లు సమాచారం. బ్యాంకులతో పోలిస్తే సూక్ష్మ రుణ నాన్‌-బ్యాంకింగ్‌ సంస్థలు (ఎంఎఫ్‌-ఎన్‌బిఎఫ్‌సీ) రుణాల మంజూరులో క్రియాశీలకంగా ఉన్నట్లు, తత్ఫలితంగా అధిక వృద్ధి నమోదు చేస్తున్నట్లు తెలుస్తోంది.

రూ.30,000-75,000 వరకు..
'కొవిడ్‌' మహమ్మారి వల్ల గత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో సూక్ష్మ రుణ పరిశ్రమ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. అదే సమయంలో రుణగ్రహీతలు, కొత్తగా రుణాలు ఆశించే వ్యక్తులు కూడా ఇబ్బందులు పడ్డారు. చిన్న చిన్న అప్పులు కూడా దొరకలేదు. అందుకే సూక్ష్మ రుణ సంస్థలు అప్పట్లో సగటున రూ.15,000 రుణాలు అధికంగా ఇచ్చాయి. ఇప్పుడు టిక్కెట్లు సైజు పెరిగింది. ఒక్కో అప్పు రూ.30,000 నుంచి రూ.75,000 మధ్య ఉంటోంది. సగటు అప్పు రూ.40,000 వరకూ ఉంటున్నట్లు స్పష్టమవుతోంది. వాయిదాలు చెల్లించని రుణాలు (ఓవర్‌డ్యూ లోన్స్‌) కూడా తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో పశ్చిమ బెంగాల్‌ను మినహాయిస్తే, తమిళనాడు, బీహార్‌, కర్ణాటక...తదితర రాష్ట్రాల్లో మెరుగైన పరిస్థితులు ఉన్నట్లు చెబుతున్నారు. సూక్ష్మ రుణ పరిశ్రమ జీఎల్‌పీ (గ్రాస్‌ లోన్‌ పోర్ట్‌ఫోలియో) ఆకర్షణీయమైన స్థాయికి పెరగటానికి ఇది ప్రధాన కారణమని వివరిస్తున్నాయి.

గిరాకీకి తగ్గట్లుగా సన్నద్ధత
సూక్ష్మ రుణాలకు గిరాకీ పెరుగుతున్నందున, దానికి తగ్గట్లుగా ఎంఎఫ్‌-ఎన్‌బీఎఫ్‌సీలు, బ్యాంకులు సన్నద్ధమవుతున్నాయి. అధిక మొత్తాలు, ఎక్కువ మందికి రుణాలు ఇవ్వటానికి సిద్ధపడుతున్నాయి. ఆర్థిక కార్యకలాపాలు పూర్తిస్థాయిలో కోలుకుంటున్నట్లు, అందువల్ల రుణాలకు గిరాకీ పెరుగుతోందని ఈ రంగానికి చెందిన సంస్థలు, బ్యాంకులు భావిస్తున్నాయి. కొవిడ్‌ మహమ్మారి తెచ్చిపెట్టిన కష్టకాలం నుంచి కోలుకున్నట్లేనని, ఇక అదంతా గతమేనని సంబంధిత వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి. ఇక్కడి నుంచి సూక్ష్మ రుణాల్లో ఇంకా ఆకర్షణీయమైన వృద్ధి ఉంటుందని, ఎక్కువ మందికి రుణాలు ఇవ్వటంతో పాటు, అప్పు మొత్తాలు (లోన్‌ సైజు) కూడా పెరుగుతాయని అంచనా వేస్తున్నాయి.

ఇవీ చదవండి: నో కాస్ట్ ఈఎంఐతో వస్తువులు కొంటున్నారా? ఇవి తెలుసుకోండి!

ఐరోపా దేశాలకు భారీగా ఔషధ ఎగుమతులు.. కలిసి రానున్న 'చైనా ప్లస్‌ వన్‌' విధానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.