ETV Bharat / business

'పన్ను' ఎక్కువవుతోందా? పెట్టుబడులకు ఇదే సరైన తరుణమా? - పన్ను ఆదా ఎఫ్‌డీలు.

Saving Schemes: చాలా మంది.. పన్ను ప్రణాళికను ముందుగా మొదలుపెట్టకపోవడం వల్ల ఇబ్బందులు పడుతుంటారు. అలా కాకుండా ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే పన్ను ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. అప్పుడే పన్ను భారం తగ్గుతుంది. ఇక పన్ను మినహాయింపే కాకుండా.. సంపద సృష్టికి కూడా కొన్ని పొదుపు పథకాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

saving-schemes
saving-schemes
author img

By

Published : Apr 16, 2022, 11:00 AM IST

Saving Schemes: ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే పన్ను ప్రణాళికనూ మొదలు పెట్టాలి. అప్పుడే పన్ను భారం తగ్గడంతోపాటు, చివరి నిమిషంలో హడావుడి పడాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 80సీ కింద రూ.1,50,000 వరకు వివిధ పథకాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఏప్రిల్‌ నుంచే శ్రీకారం చుట్టాలి. కేవలం పన్ను మినహాయింపు ఒక్కటే కాకుండా.. దీర్ఘకాలంలో సంపద సృష్టికీ ఈ పథకాలు ఉపయోగపడేలా చూసుకోవాలి.

ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్‌).. మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు అందించే ఈఎల్‌ఎస్‌ఎస్‌లు.. ఈక్విటీల్లో పెట్టుబడులు పెడుతూ.. పన్ను ఆదా చేసుకునే వెసులుబాటును అందిస్తాయి. పన్ను ఆదా పథకాల్లో తక్కువ వ్యవధి ఉన్నది వీటికే. మూడేళ్ల తర్వాత పెట్టుబడిని వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. సెక్షన్‌ 80సీ పరిమితి మేరకు రూ.1,50,000 వరకు ఇందులో మదుపు చేయొచ్చు. అంతకు మించి పెట్టుబడి పెట్టేందుకూ వీలుంది. ఇప్పుడిప్పుడే సంపాదన ప్రారంభించిన వారు.. పన్ను ఆదా పెట్టుబడుల కోసం వీటిని ఎంచుకోవచ్చు. ఒకేసారి లేదా క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌) ద్వారా వీటిలో మదుపు చేయొచ్చు. పన్ను ఆదా.. పెట్టుబడి వృద్ధి ఈ రెండింటికీ ఈ పథకాలు తోడ్పడతాయి. గత చరిత్రను పరిశీలిస్తే.. ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాలు రెండంకెల రాబడిని అందించినట్లు తెలుస్తుంది. ఒక ఏడాదిలో రూ.లక్షకు మించి మూలధన లాభం ఆర్జిస్తే.. నిబంధనల మేరకు 10శాతం చొప్పున పన్ను చెల్లించాలి.

ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌).. ప్రభుత్వ హామీ ఉన్న 15 ఏళ్ల దీర్ఘకాలిక పథకమిది. ఇందులో ప్రస్తుతం 7.1శాతం వార్షిక ప్రతిఫలం అందుతోంది. పెట్టిన పెట్టుబడితోపాటు, వచ్చిన రాబడికీ పన్ను ఉండకపోవడం దీని ప్రత్యేకత. అందుకే, దీర్ఘకాలిక పెట్టుబడి కోసం చూస్తున్నవారు దీన్ని ఎంచుకోవచ్చు. పిల్లల చదువులు, పదవీ విరమణ తదితర లక్ష్యాలు దీనితో నెరవేర్చుకోవచ్చు. ఏడాదికి రూ.500 కనీస మొత్తంతో.. రూ. 1,50,000 వరకు జమ చేసేందుకు వీలు కల్పిస్తుంది. 15 ఏళ్ల తర్వాత అవసరాన్ని బట్టి, అయిదేళ్ల చొప్పున వ్యవధి పెంచుకోవచ్చు. జాతీయ బ్యాంకులు, ఎంపిక చేసిన ప్రైవేటు బ్యాంకులు, పోస్టాఫీసుల్లోనూ ఈ ఖాతాను ప్రారంభించవచ్చు.

జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌).. పదవీ విరమణ కోసం మదుపు చేయాలనుకునే వారికి స్వచ్ఛంద పొదుపు పథకం ఎన్‌పీఎస్‌. ఇందులో ప్రైవేటు, ప్రభుత్వ, అసంఘటిత ఉద్యోగులు ఈ పథకంలో చేరొచ్చు. పదవీ విరమణ వరకు పెట్టుబడులు కొనసాగించాల్సి ఉంటుంది. పదవీ విరమణ తర్వాత 60 శాతం పెట్టుబడిని వెనక్కి తీసుకొని, మిగతా 40 శాతంతో యాన్యుటీ పథకాలను కొనుగోలు చేయాలి. ఈ పథకం ద్వారా ఈక్విటీల్లోనూ పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి.. కాస్త అధిక రాబడికి అవకాశం ఉంటుంది. ఇందులో గరిష్ఠంగా ఎంత మొత్తమైనా మదుపు చేసుకోవచ్చు. కానీ, సెక్షన్‌ 80సీసీడీ (1బీ) కింద రూ.50వేల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇది సెక్షన్‌ 80సీ పరిమితికి అదనం.

పన్ను ఆదా ఎఫ్‌డీలు.. బ్యాంకులో అయిదేళ్ల పన్ను ఆదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాలు అందుబాటులో ఉంటాయి. ఇవి సురక్షితమైనవే. కానీ, వడ్డీ తక్కువగా లభిస్తుంది. ఒకేసారి పెట్టుబడి పెట్టి, అయిదేళ్లపాటు కొనసాగించాలి. దీనిపై వచ్చిన వడ్డీని వ్యక్తిగత ఆదాయంలో కలిపి, వర్తించే శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాలి. వడ్డీ ఆదాయం రూ.40వేలు దాటితే.. బ్యాంకులు మూలం వద్ద పన్ను కోత విధిస్తాయి.

ఇవి కేవలం పెట్టుబడి పథకాలే. సెక్షన్‌ 80సీలో ఈపీఎఫ్‌, వీపీఎఫ్‌, జీవిత బీమా పాలసీ ప్రీమియం, ఇద్దరు పిల్లల ట్యూషన్‌ ఫీజులు, ఇంటి రుణం అసలు.. ఇలా అన్నీ కలిసి ఉంటాయి. మీరు ఈ పథకాలను ఎంచుకునేటప్పుడు గత ఆర్థిక సంవత్సరంలో ఎంత పన్ను చెల్లించారు అనేది పరిశీలించి, అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోండి.

జాతీయ పొదుపు పథకాలు.. (ఎన్‌ఎస్‌సీ).. సంప్రదాయ పెట్టుబడిదారులకు జాతీయ పొదుపు పత్రాలు మంచి పథకాలనే చెప్పొచ్చు. ప్రభుత్వ హామీ ఉండటం, 6.8శాతం వరకు వార్షిక రాబడిని అందించడం వీటి ప్రత్యేకతలు. ఏదైనా పోస్టాఫీసులో వీటిని కొనుగోలు చేయొచ్చు. కనీసం రూ.1,000 పెట్టుబడి చాలు. అయిదేళ్ల వరకు కొనసాగించాలి. గరిష్ఠంగా ఎంత మొత్తంతోనైనా ఈ పత్రాలు తీసుకోవచ్చు. కానీ, పన్ను విషయంలో మాత్రం సెక్షన్‌ 80సీ పరిమితికి లోబడి రూ.1.50లక్షల వరకే అనుమతి ఉంటుంది.

ఇవీ చదవండి: ఆ సంస్థలో పెరిగిన 'బిగ్​బుల్'​ వాటా.. 44 లక్షల షేర్లు కొనుగోలు

ట్విట్టర్‌పై మస్క్‌కు ఎందుకంత మక్కువ? ప్లాన్‌-బి ఏంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.