ETV Bharat / business

Mukesh Ambani Employees Salary : అంబానీ ఇంట్లో పనిచేసే వారికి అంత జీతమా..! - వైరల్ అవుతున్న అంబానీ ఉద్యోగుల జీతభత్యాలు

Mukesh Ambani Employees Salaries : సెలబ్రిటీలు ఏం తింటారు..? వారి ఇంట్లో పనిచేసే వారికి ఎంత జీతాలిస్తారు..? వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది..? అనే విషయాలపై చాలా మందికి ఆసక్తి ఉంటుంది. అలాంటిది ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ముకేశ్ అంబానీ గురించి న్యూస్​ వస్తే.. క్షణాల్లోనే వైరల్​ అవుతుంది. అలాంటిదే ఇది. అంబానీ ఇంట్లో పని చేసే వారి జీతభత్యాల గురించి ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. మరి ఇంతకీ వాళ్ల జీతాల గురించి తెలిస్తే షాక్​ అవ్వడం పక్కా..

Salary of Mukesh Ambani Employess
Salary of Mukesh Ambani Employess
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 22, 2023, 2:01 PM IST

Mukesh Ambani Employees Salaries in Telugu : సెలబ్రిటీ.. ఈ పదానికున్న ఆకర్షణే వేరు. సెలబ్రిటీల లైఫ్‌స్టైల్‌తో పాటు వారి దగ్గర పనిచేసేవారు అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా అపరకుబేరుడు ముకేశ్‌ అంబానీ(Mukesh Ambani) ఇంట్లో పనిచేసే వారి జీతభత్యాల గురించి ఓ వార్త ఆసక్తికరంగా మారింది. అంబానీ ఇంట్లో పనిచేసే వర్కర్ల జీతాల గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే.! టాప్​ మల్టీనేషనల్​ కంపెనీల్లో పనిచేస్తున్న సాఫ్ట్​వేర్ ఉద్యోగుల(Software Employees) కన్నా, సీఏ, ఎంబీఏ చదివి పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగుల కన్నా అంబానీ ఇంట్లో పనిచేసే వారికి జీతం ఎక్కువని టాక్​. ఇంతకీ ప్రపంచకుబేరుడు ముఖేశ్ అంబానీ ఇంట్లో ఎంతమంది పనిచేస్తారు? వారి జీతభత్యాలు ఎంతో ఇప్పుడు మనం ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Mukesh Ambani Antilia Building Specialities : రిలయన్స్ అధినేత ముకేశ్​ అంబానీ దేశంలోనే కాదు, ఆసియాలోనే అత్యంత ధనవంతుడు. ప్రస్తుతం ముకేశ్​ అంబానీ కుటుంబం ముంబయిలోని అల్టామౌంట్ రోడ్‌లో నిర్మించిన 'ఆంటిలియా(Antilia)'లో నివాసముంటోంది. ఈ భవనం 4532 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. దీని ధర దాదాపు రూ.15 వేల కోట్లుగా అంచనా. లండన్​లో ఉన్న బకింగ్​హామ్ ప్యాలెస్ తర్వాత అత్యంత ఖరీదైన భవనం కూడా ఇదే.

ఈ ఆంటిలియా భవనం మొత్తం 27 అంతస్తుల్లో ఉంటుంది. కానీ భవనం అసలు ఎత్తు 40 అంతస్తులుగా కనిపిస్తుంది. దీనిని తీవ్ర భూకంపం వచ్చినా తట్టుకునేలా రూపొందించారు. ఈ 27 అంతస్తుల ఆంటిలియా భవనంలో మూడు హెలిపాడ్లు, 168 కార్ల పార్కింగ్‌ కోసం ఆరు అంతస్తులు, 50 మంది కూర్చుని చూసే సినిమా థియేటర్‌, స్పా, బాల్ రూమ్, 3 స్విమ్మింగ్ పూల్స్, యోగా, డ్యాన్స్ స్టూడియోలు, 9 ఎలివేటర్లు ఇతర అధునాతన సదుపాయాలున్నాయి. ఇంతటి విలాసవంతమైన భవనంలో ఎంత మంది పని చేస్తారో ఇప్పుడు చూద్దాం.

Ambani Ganesh Chaturthi Celebration 2023 : అంబానీ గణేశ్ వేడుకల్లో సౌత్ స్టార్స్​ సందడి.. వీడియో చూశారా?

What is Salary of Ambani Employees : ఈ అపరకుబేరుడు ముకేశ్ అంబానీ ఆంటిలియా భవంతిలో దాదాపుగా 600 మంది సిబ్బంది పనిచేస్తున్నారని తెలుస్తోంది. ఓ నివేదిక ప్రకారం కొద్ది రోజుల క్రితం అంబానీ ఇంట్లో పనిచేసే వంటమనిషి వేతనం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే అంబానీ షెప్​లకు(Ambani Chef Salary) ఒక్కొకక్కరికి నెలకు రూ. 2 లక్షల జీతం అని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. అంటే వారికి ఏడాదికి రూ.24 లక్షల ప్యాకేజ్ అన్నమాట. మరో విషయం ఏంటంటే.. ఈ ఆంటిలియా భవనంలో పనిచేసే ప్రతి సిబ్బందికీ దాదాపు ఇంతే మొత్తంలో జీతభత్యాలు ఉంటాయని సమాచారం.

బహుళజాతి కంపెనీల్లో పనిచేసే వృత్తి నిపుణులకు కూడా ఈరోజుల్లో ఆ మొత్తంలో జీతం లభించడం లేదు. అంబానీ ఇంట్లో పనిచేసే వారికి ఇక నెల జీతంతో పాటు మరెన్నో ప్రయోజనాలు కల్పిస్తున్నారు. 24/7 అంబానీ నివాసంలోనే పూర్తి వసతి ఏర్పాట్లు, ఇన్సూరెన్స్, పిల్లలకు ట్యూషన్ ఫీజులను కూడా అందిస్తారట. అయితే అంబానీ ఇంట్లో పనిచేస్తున్నారంటే.. వారికి పనిలో ఎంత నైపుణ్యం ఉందో అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

రిలయన్స్​లో ముకేశ్ అంబానీ​ కంటే.. అత్యధిక వేతనం పొందే వ్యక్తి మీకు తెలుసా?

వీడియో కాల్​లో రూ.650 కోట్ల డీల్​.. అంబానీ కొత్త 'ఇల్లు' ఎంతో స్పెషల్.. జేమ్స్​ బాండ్ సినిమాల​ షూటింగ్​ కూడా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.