ETV Bharat / business

రిలయన్స్ జియో సూపర్​ ఆఫర్​ - ఉచిత ఓటీటీ సబ్​స్క్రిప్షన్​ సహా అన్​లిమిటెడ్ 5G ఇంటర్​నెట్! - జియో సూపర్ రీఛార్జ్ ప్లాన్

Reliance Jio New Prepaid Plan : రిలయన్స్ జియో యూజర్లను ఆకట్టుకునేలా మరో సరికొత్త రీఛార్జ్ ప్లాన్​ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ఓటీటీ కంటెంట్ ఎక్కువగా చూసే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. జియో ప్రవేశపెట్టిన ఈ నయా ప్లాన్ ద్వారా ప్రముఖ ఓటీటీల సబ్‌స్క్రిప్షన్స్‌తో పాటు మరెన్నో బెనిఫిట్స్ పొందవచ్చు. మరి, ఆ ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

Jio
Jio
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 6, 2023, 10:59 AM IST

Reliance Jio New Recharge Offer : ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తమ యూజర్లను అట్రాక్ట్ చేసేందుకు మరో బంపరాఫర్ ప్రకటించింది. ఒకప్పుడు ఉచితంగా డైటా, అన్​లిమిటెడ్ వాయిస్ కాలింగ్ వంటి బెనిఫిట్స్​తో అందరినీ తనవైపు తిప్పుకున్న జియో.. అదే పరంపరను కొనసాగించడంలో విజయవంతంగా దూసుకెళ్తోందని చెప్పుకోవచ్చు. ఆకట్టుకునే ఆఫర్లతో యూజర్లను పెంచుకోవడంతో పాటు అతి తక్కువ కాలంలోనే టెలికాం రంగంలో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ క్రమంలో తన స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త రీఛార్జ్ ఆఫర్స్ ప్రకటిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల రిలయన్స్ జియో(Reliance Jio).. ఉచితంగా ప్రముఖ ఓటీటీల సబ్​స్ర్కిప్షన్స్​తో పాటు మరెన్నో బెనిఫిట్స్ పొందెలా అదిరిపోయే ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటి? దాని ద్వారా పొందే ప్రయోజాలెంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Jio Rs 909 Prepaid Recharge Plan : టెలికాం రంగంలో చౌక రీఛార్జ్ ప్లాన్‌ల విషయానికి వస్తే.. రిలయన్స్ జియో మొదటి స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు. తన కస్టమర్ల కోసం ఎప్పుడూ సూపర్ ప్లాన్స్ తీసుకొచ్చే రిలయన్స్ జియో.. ఇప్పుడు రూ. 909కే అదిరిపోయే ప్రీపెయిడ్ ప్లాన్​ను ప్రకటించింది. ఈ రీఛార్జ్​ ప్లాన్​తో ఉచిత ఓటీటీ(OTT) సబ్​స్క్రిప్షన్​తో పాటు మరెన్నో ప్రయోజనాలు పొందవచ్చు. అలాగే అన్ని సాధారణ రీఛార్జ్ ప్లాన్ల మాదిరిగానే ఈ ప్లాన్ ద్వారా కూడా అన్‌లిమిటెడ్ కాలింగ్, 5జీ డేటా, ఎస్ఎంఎస్ ప్యాక్ వంటివి అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. ఈ ప్లాన్​కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం..

రిలయన్స్ జియో రూ. 909 ప్రీపెయిడ్ ప్లాన్.. జియో కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్యాక్ ద్వారా ప్రతిరోజూ 2GB డేటా వస్తుంది. అంటే మీరు మొత్తం 168 GB 4G డేటాను పొందుతారు. అలాగే డైలీ వచ్చే లిమిటెడ్ డేటా అయిపోయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 64 kbpsకి తగ్గిపోనుంది. ఇక ప్రీపెయిడ్ ప్లాన్​తో దేశంలోని అన్ని నెట్వర్క్​లకు అన్​లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ప్రయోజం పొందవచ్చు. అలాగే STD కాల్స్ కూడా చేయవచ్చు. అదేవిధంగా రోజుకు ఉచితంగా 100 SMSలు ఏ నెట్​వర్క్​కైనా పంపుకోవచ్చు.

ఉచితంగా "నెట్​ఫ్లిక్స్" సబ్​స్క్రిప్షన్ కావాలా​? మొబైల్ రీఛార్జ్ చేస్తే చాలు!!

ఆ ఓటీటీల సబ్​స్క్రిప్షన్ ఫ్రీ.. జియో అందిస్తున్న రూ. 909 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జు చేసుకున్న వారు.. Sony LIV, ZEE5, JioTV, JioCinema, JioCloud లాంటి ప్రముఖ ఓటీటీల సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందవచ్చు. వినియోగదారులు JioTV యాప్ ద్వారా ఈ సేవలకు సభ్యత్వం తీసుకోవచ్చు. ఒకవేళ మీరు Jio 5G నెట్‌వర్క్‌ని ఉపయోగిస్తుంటే ఈ ప్యాక్‌లో అపరిమిత 5G డేటాను పొందవచ్చు. ఇక చివరగా ఈ ప్లాన్‌లో అందుబాటులో ఉన్న JioCinema సబ్‌స్క్రిప్షన్.. JioCinema ప్రీమియం కంటెంట్‌కు యాక్సెస్‌ను అందించదనే విషయం మీరు గమనించాలి.

ఫ్రీగా OTT సబ్​స్క్రిప్షన్స్ కావాలా? ఈ AirFiber​​ ప్లాన్స్​పై ఓ లుక్కేయండి!

బెస్ట్​ రూ.199 ప్లాన్​ (జియో/ ఎయిర్​టెల్/ వొడాఫోన్/ BSNL)​ ఏదంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.