ETV Bharat / business

Reliance MD : మరో 5 ఏళ్లపాటు రిలయన్స్ హెడ్​గా ముకేశ్ అంబానీ.. జీతం ఎంతంటే? - nita ambani salary

Reliance Chairman Mukesh Ambani : రిలయన్స్​ ఛైర్మన్​ అండ్ మేనేజింగ్ డైరెక్టర్​గా మరో ఐదేళ్లపాటు ముకేశ్ అంబానీ పనిచేయనున్నారు. ఈ మేరకు కంపెనీ షేర్​ హోల్డర్లు ప్రత్యేక తీర్మానం చేశారు. దీనితో 2029 ఏప్రిల్​ వరకు ముకేశ్​ అంబానీయే రిలయన్స్​ ఇండస్ట్రీస్​ లిమిటెడ్​ ఛైర్మన్​ అండ్ మేనేజింగ్​ డైరెక్టర్​గా కొనసాగనున్నారు.

Reliance Chairman Mukesh Ambani
Reliance MD
author img

By

Published : Aug 6, 2023, 5:02 PM IST

Updated : Aug 6, 2023, 5:30 PM IST

Reliance Chairman Mukesh Ambani : రిలయన్స్ ఇండస్ట్రీస్​ లిమిటెడ్​ ఛైర్మన్ అండ్​ మేనేజింగ్​ డైరెక్టర్​గా మరో 5 ఏళ్లపాటు ముకేశ్​ అంబానీయే కొనసాగనున్నారు. ఈ మేరకు కంపెనీ షేర్​ హోల్డర్లు తీర్మానం చేశారు. దీనితో 2029 ఏప్రిల్​ వరకు ముకేశ్​ అంబానీ రిలయన్స్ హెడ్​ పనిచేయనున్నారు. కానీ ఈ సమయంలో ఆయన ఎలాంటి జీతం తీసుకోకుండా పనిచేస్తానని చెప్పడం విశేషం.

బిగ్​ బాస్​
Mukesh Ambani : రిలయన్స్ ఇండస్ట్రీని ముకేశ్​ అంబానీ అత్యున్నత శిఖరాలకు తీసుకువెళ్లారనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే షేర్ హాల్డర్లు ఆయననే కంపెనీ ఛైర్మన్​ అండ్​ ఎమ్​డీగా కొనసాగించాలని నిర్ణయించారు. అయితే కంపెనీ లా ప్రకారం, ఒక వ్యక్తి 70 ఏళ్ల వరకు మాత్రమే ఈ పదవిలో కొనసాగగలరు. ప్రస్తుతం ముకేశ్​ అంబానీ వయస్సు 66 సంవత్సరాలు. అందుకే కంపెనీ షేర్​ హోల్డర్లు ప్రత్యేక తీర్మానం చేసి, ఆయనను 2029 ఏప్రిల్​ వరకు రిలయన్స్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్​గా ఎన్నుకున్నారు.

ధీరూభాయి తరువాత!
ముకేశ్​ అంబానీ 1977లో రిలయన్స్ ఇండస్ట్రీలో చేరారు. 2002 జులైలో తన తండ్రి ధీరూభాయి అంబానీ మరణించిన తరువాత.. కంపెనీ ఛైర్మన్​గా ముకేశ్​ అంబానీ పగ్గాలు చేపట్టారు.

ప్రత్యేక తీర్మానం!
Reliance special resolution latest news : 2023 జులై 21న రిలయన్స్ కంపెనీ షేర్​ హోల్డర్లు ప్రత్యేక తీర్మానం చేసారు. దీనితో బోర్డ్ ఆఫ్​ డైరెక్టర్లు.. ముకేశ్​ అంబానీని రిలయన్స్ కంపెనీ మేనేజింగ్​ డైరెక్టర్​గా రీ-అపాయింట్​ చేశారు. ముకేశ్​​ అంబానీ ప్రస్తుత టెర్మ్​ 2024 ఏప్రిల్​ 18తో ముగుస్తుంది. అయితే 2019 ఏప్రిల్​ 19 నుంచి మరో ఐదేళ్లపాటు ఆయన రిలయన్స్ ఇండస్ట్రీస్​ ఛైర్మన్​ అండ్​ మేనేజింగ్​ డైరెక్టర్​గా కొనసాగనున్నారు.

శాలరీ తీసుకోను!
Mukesh Ambani Salary : ముకేశ్​​ అంబానీ కంపెనీ ఛైర్మన్​ అండ్ ఎండీగా ఉంటూ రూ.15 కోట్లు వరకు శాలరీగా తీసుకునేవారు. కానీ కొవిడ్​ 19 మహమ్మారి వ్యాప్తి తరువాత ఆయన తన పూర్తి జీతాన్ని వదులుకున్నారు. ముఖ్యంగా 2021 ఆర్థిక సంవత్సరం నుంచి ఆయన పూర్తిగా జీతం తీసుకోవడం మానేశారు. ఇకపై కూడా అంటే, 2024 ఏప్రిల్​ 19 నుంచి 2029 ఏప్రిల్​ 18 వరకు ఆయన ఎలాంటి శాలరీ తీసుకోకుండానే పనిచేస్తానని కంపెనీ బోర్డ్​కు రిక్వెస్ట్ చేశారు. అందుకు బోర్డు కూడా సానుకూలంగా స్పందించింది.

ఈ ఫెసిలిటీస్​ మాత్రం ఉంటాయ్​!
ముకేశ్​​ అంబానీ కంపెనీ ఎండీగా జీతం తీసుకోనప్పటికీ.. ఆయనకు కొన్ని ప్రత్యేక భత్యాలు ఉంటాయి. ట్రావెలింగ్​, బోర్డింగ్​, లాడ్జింగ్​, బిజినెస్​ ట్రిప్స్​, కార్​ ప్రొవిజన్స్​, ఫోన్ బిల్లులు రీయంబర్స్​మెంట్​ చేస్తారు. దీనితోపాటు ముకేశ్​ అంబానీకి, ఆయన కుటుంబానికి అయ్యే సెక్యూరిటీ ఖర్చులు కూడా కంపెనీయే భరిస్తుంది.

నీతా అంబానీ సంగతేంటి?
Nita Ambani Salary : ముకేశ్​ అంబానీ భార్య నీతా అంబానీ, కంపెనీ బోర్డులో నాన్ -ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​గా ఉన్నారు. ఆమె 2022-23 ఆర్థిక సంవత్సరంలో సిట్టింగ్​ ఫీజుగా రూ.6 లక్షలు తీసుకున్నారు. అలాగే కమిషన్​గా రూ.2 కోట్లు తీసుకున్నారు.

Motor Insurance Tips : వాహన బీమా తీసుకుంటున్నారా?.. ఈ జాగ్రత్తలు పాటించండి!

Business Success Story : ఫాదర్​ ఆఫ్​ ఇండియన్ ఐస్​క్రీం.. విజయగాథ మీకు తెలుసా?

Last Updated : Aug 6, 2023, 5:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.