ETV Bharat / business

హోమ్ లోన్ ఇప్పుడే తీసుకోవాలా? వడ్డీ రేట్లు తగ్గుతాయా? అలా చేస్తే నష్టమా? - హోమ్ లోన్ వడ్డీ రేట్

Home loan interest rate : కీలక వడ్డీ రేట్లను ఆర్​బీఐ మార్చకపోవడం రుణం తీసుకున్న వారికి కొంత ఊరట కలిగించే వార్తే. అయితే, వడ్డీ రేట్లు ఇలాగే ఎంత కాలం ఉంటాయనేది తెలియదు. మరి గృహరుణం కోసం ప్రయత్నిస్తున్నవారు.. వడ్డీ రేట్లు తగ్గే వరకు ఆగాలా? ఇప్పుడే తీసుకుంటే నష్టమా? నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.

rbi repo rate impact on home loan
rbi repo rate impact on home loan
author img

By

Published : Jun 9, 2023, 10:12 AM IST

Home loan interest rate : భారతీయ రిజర్వ్ బ్యాంకు కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. అప్పు తీసుకున్న, తీసుకోబోయే వారికి ఇది కొంత ఊరట కలిగించే వార్త అయినప్పటికీ.. ఈ రేట్లు ఇలాగే ఎంత కాలం ఉంటాయనే విషయంలో అనిశ్చితి కొనసాగుతోంది. రుణాలు ఖరీదుగా మారితే.. అప్పు తీసుకున్నవారికి పలు సవాళ్లు ఎదురవుతుంటాయి. కొంతమంది విషయంలో రుణ అర్హత తగ్గే అవకాశం ఉంది. దీని వల్ల కొనబోయే ఇంటి విస్తీర్ణంపై ప్రభావం ఉండొచ్చు. మరి.. ఇలాంటి పరిస్థితుల్లో గృహ రుణం తీసుకోవాలా? ఇంకొంత సమయం వేచి చూడాలా? అనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. దీనికి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

RBI Repo rate impact on home loan : ద్రవ్యోల్బణం కదలికలను ఆర్​బీఐ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉంటుంది. మార్చిలో వార్షిక రిటైల్ ద్రవ్యోల్బణం 5.66 శాతానికి తగ్గింది. ఫిబ్రవరి నెలలో 6.44 శాతంతో పోలిస్తే ఇది 15 నెలల కనిష్ఠ స్థాయి. ఈ నేపథ్యంలో రాబోయే ద్రవ్య విధాన సమీక్ష అనంతరం వడ్డీ రేట్లలో మార్పులు ఉండొచ్చు. కాబట్టి.. వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులు ఉంటాయన్న విషయాన్ని గుర్తించాలి. సాధారణంగా గృహ రుణాలు చలన వడ్డీ విధానం ఉంటాయి. రెపో రేటు మారినప్పుడల్లా గృహ రుణ వడ్డీ రేట్లు మారిపోతాయి. కాబట్టి.. వడ్డీ రేటు గురించి ఆలోచించకుండా వ్యక్తిగతంగా హోమ్ లోన్​కు సిద్ధమవ్వాలి. ప్లాన్ ప్రకారం వెళ్తే సొంతింటి కల సాకారం అవుతుంది.

ఆర్థిక ఆరోగ్యం బాగుందా?
ఆర్థికంగా స్థిరంగా ఉన్నామా లేదా అని కొత్తగా రుణం తీసుకునే వారు తప్పక పరిశీలించుకోవాలి. గృహరుణం దీర్ఘకాలం కొనసాగుతుంది. కాబట్టి, నెలవారీ చెల్లింపుల విషయంలో ఇబ్బంది లేదన్న విషయాన్ని నిర్ధరించుకోవాలి. సాధారణంగా ఇంటి విలువలో 75-80శాతం వరకూ రుణం లభిస్తుంది. రిజిస్ట్రేషన్‌, స్టాంప్‌ డ్యూటీ వంటి ఇతర ఖర్చులు కూడా ఉంటాయి. ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటే ఆస్తి విలువలో కనీసం 30-40 శాతం మీరు భరించగలగాలి. మిగిలిన మొత్తం రుణం ద్వారా సమీకరించవచ్చు. మీరు ఆర్థికంగా బలంగా లేకపోయినా, మార్జిన్‌ మొత్తం తక్కువగా ఉన్నా రుణం తీసుకునే విషయంపై పునరాలోచన చేయాల్సి ఉంటుంది. మెరుగైన ఆర్థిక స్థితికి చేరేంత వరకూ సొంతింటి నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడమే మంచిది.

స్కోరు బాగుందా?
రుణ వడ్డీ రేట్లను బ్యాంకులు.. క్రెడిట్‌ స్కోరుతో ముడి పెడుతున్నాయి. మంచి క్రెడిట్‌ స్కోరుంటే.. వడ్డీలో రాయితీ లభిస్తుంది. తక్కువ వడ్డీకి రుణం లభిస్తే దీర్ఘకాలంలో డబ్బు ఆదా అవుతుంది. మీ క్రెడిట్‌ స్కోరు తక్కువగా ఉంటే అధిక వడ్డీ రేటును చెల్లించాల్సి వస్తుంది. ఇది మీ రుణాన్ని మరింత ఖరీదైన లోన్​గా మారుస్తుంది. 750 పాయింట్లకు మించి స్కోరుంటే సులభంగా రుణాలు లభిస్తాయి. ఇదివరకే తీసుకున్న రుణాలను క్రమం తప్పకుండా చెల్లిస్తూ ఉంటే బ్యాంకులు తక్కువ స్కోరునూ పరిగణనలోకి తీసుకుంటాయి. క్రెడిట్‌ స్కోరు మెరుగ్గా ఉంటే రుణం పొందే అవకాశాలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా వడ్డీ రేట్ల కోసం బ్యాంకులతో చర్చించే వీలు కూడా ఉంటుంది. రుణం కోసం దరఖాస్తు చేసే ముందు మీ క్రెడిట్‌ స్కోరు మంచి స్థితిలో ఉందో లేదో స్వయంగా తెలుసుకోండి.

వడ్డీ తగ్గితే!
ఉదాహరణకు భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గుతాయని అనుకుందాం. కానీ, ఇది ఎప్పుడు అనేది ఊహించలేం. ప్రస్తుతం వడ్డీ రేట్లు అధికంగానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం ఎక్కువ కాలం అదుపులోనే ఉంటే వడ్డీ రేట్లను ఆర్‌బీఐ తగ్గించవచ్చు. ఇల్లు కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంటే.. వడ్డీ రేట్లు తగ్గుముఖం పట్టే వరకూ ఆగాల్సిన అవసరం లేదు. మీరు చలనా వడ్డీ విధానంలోనే రుణం తీసుకుంటారు. కాబట్టి, రెపో రేటు తగ్గినప్పుడల్లా.. గృహరుణంపై వడ్డీ తగ్గుతుంది. కాబట్టి, ఇబ్బందేమీ ఉండదు.

చర్చించండి..
బ్యాంకులు లేదా గృహరుణ సంస్థలను సంప్రదించే ముందు సొంతంగా కొంత పరిశోధన చేసుకోవడం మంచిది. వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో పోల్చి చూసుకోవాలి. క్రెడిట్‌ స్కోరు కూడా కీలకం. స్థిరమైన ఆదాయం ఉండి.. రుణాలు తక్కువగా ఉన్నాయని బ్యాంకు అధికారులు నిర్ధరించుకుంటే.. రాయితీ వడ్డీకి రుణం లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలంగా ఖాతాను కొనసాగిస్తున్న బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు. మీ ఆర్థిక వివరాలన్నీ వారి దగ్గరే ఉంటాయి. కాబట్టి, రుణం తీసుకునేటప్పుడు అది కొంత ఉపయోగపడుతుంది.

తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోవద్దు. కొంచెం సమయాన్ని వెచ్చించి అన్ని లెక్కలూ వేసుకోండి. ఆ తర్వాతే రుణానికి దరఖాస్తు చేయండి. వడ్డీ రేట్లు గరిష్ఠ స్థాయిలో ఉన్నప్పుడు లోన్ తీసుకోవాలా, లేదంటే కొంత కాలం ఆగాలా అనేది మీ ఆర్థిక స్థితిగతులపై ఆధారపడి ఉంటుంది. ముందే అనుకున్నట్లు ఎలాంటి ఇబ్బందీ లేకుండా 10-20 ఏళ్లపాటు నిరంతరాయంగా వాయిదాలను చెల్లిస్తాను అనుకున్నప్పుడే గృహరుణం తీసుకోవడం శ్రేయస్కరం.

ధరలు పెరుగుతాయి..
మీరు ఇల్లు కొనుగోలు చేయాలనుకునే ప్రాంతంలో మెరుగైన వసతులు ఉంటే.. ఇక వేచి చూడటంలో అర్థం లేదు. ఎందుకంటే.. అక్కడ స్థిరాస్తుల ధరలు పెరుగుతూనే ఉంటాయి. మీరు ఆలస్యం చేస్తే ఇల్లు కొనడం ఆర్థికంగా భారమవుతుంది. వడ్డీ రేటు తగ్గినా, ఆస్తి ధర పెరిగితే మీకు భారం తప్ప ప్రయోజనం ఉండదు.
-అధిల్‌ శెట్టి, సీఈఓ, బ్యాంక్‌బజార్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.