ETV Bharat / business

ఆర్​బీఐ కీలక నిర్ణయం.. మాస్టర్​ కార్డ్​పై ఆంక్షలు ఎత్తివేత - rbi mastercard restrictions mposed

RBI MASTER CARD: ఆర్​బీఐ కీలకం నిర్ణయం తీసుకుంది. మాస్టర్​ కార్డ్​ వ్యాపార పరిమితులపై విధించిన ఆంక్షలను ఎత్తివేసింది. పేమెంట్స్‌కు సంబంధించిన డేటాను భద్రపరచడంలో మాస్టర్​ కార్డ్​ వివరణ ఇచ్చిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

MASTER CARD
మాస్టర్ కార్డు
author img

By

Published : Jun 16, 2022, 10:56 PM IST

RBI MASTER CARD: మాస్టర్‌ కార్డ్‌ వ్యాపార పరిమితులపై విధించిన ఆంక్షలను రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా ఎత్తివేసింది. పేమెంట్స్‌కు సంబంధించిన డేటాను భద్రపరచడంలో విఫలమైన కారణంగా గతేడాది జులై 14న విధించిన ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ఆర్‌బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. "డేటా స్టోరేజీ నిబంధనలు పాటించని కారణంగా మాస్టర్‌ కార్డ్‌పై గతేడాది విధించిన ఆంక్షలను ఎత్తివేస్తున్నాం. మాస్టర్‌ కార్డ్‌ వివరణ సంతృప్తికరంగా అనిపించడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇకపై తన డెబిట్‌, క్రెడిట్‌, ప్రీపెయిడ్‌ నెట్‌వర్క్‌లోకి కొత్త వినియోగదారులను చేర్చుకోవచ్చు" అని ఆర్‌బీఐ తన ప్రకటనలో పేర్కొంది.

కాగా.. పేమెంట్స్‌కు సంబంధించిన డేటాను దేశీయంగానే భద్రపరచాలని 2018 ఏప్రిల్‌ 6న ఆర్‌బీఐ ఆదేశించింది. ఇందుకోసం ఆరు నెలల గడువు ఇచ్చింది. గడువు పూర్తైనా నిబంధనలు పాటించడంలో మాస్టర్‌ కార్డ్‌ విఫలమయ్యింది. దీంతో పేమెంట్స్‌ అండ్‌ సెటిల్‌మెంట్‌ సిస్టమ్స్‌ చట్టం 2007 (పీఎస్‌ఎస్‌ చట్టం) ప్రకారం ఆర్‌బీఐ చర్యలు తీసుకుంది. దీంతో కొత్త కార్డులు జారీ చేయకుండా నిషేధం విధించింది. తాజాగా ఈ నిబంధనలు ఎత్తివేస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించడంతో వినియోగదారుల కోసం మాస్టర్‌ కార్డ్‌ త్వరలో కొత్త కార్డులను జారీ చేయనుంది.

ఇవీ చూడండి: ప్రయాణికులకు షాక్.. 'టికెట్ రేట్లు 15% పెంపు!'.. ఏటీఎఫ్​ బాదుడే కారణం!

దలాల్​ స్ట్రీట్​పై ఫెడ్​ దెబ్బ- సెన్సెక్స్​ 1000 మైనస్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.