ETV Bharat / business

Bank holidays in May : మే నెలలో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్ ఇదే.. - 2023 ఏడాది బ్యాంకుల సెలవులు

May bank holidays 2023 : మీరు తరచూ ఆర్ధిక లావాదేవీల కోసం బ్యాంక్‌కు వెళ్తుంటారా? అయితే ఈ వార్త మీకోసమే. మే నెలలో 12 రోజులు (అన్ని రాష్ట్రాల్లో కలిపి) బ్యాంకులకు సెలవులు. మీకు ఒకవేళ బ్యాంక్ పనులు ఉన్నట్లయితే.. ముందుగా ఈ సెలవుల లిస్టు ఏంటో ఓసారి చూసి.. ముందస్తుగా ప్లాన్‌ చేసుకోండి!

Bank holidays in May 2023
Bank holidays in May 2023
author img

By

Published : May 1, 2023, 2:04 PM IST

Bank holidays in May : బ్యాంకు వినియోగదారులకు అలర్ట్‌. మే నెలలో బ్యాంకులకు 12 రోజుల పాటు సెలవులు (అన్ని రాష్ట్రాల్లో కలిపి) ఉండనున్నాయి. వినియోగదారులు ముందస్తుగా గమనించి బ్యాంక్‌ పనులను ప్లాన్‌ వేసుకోవడం మంచిది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్​బీఐ) ప్రతి నెలా.. బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది. మే నెల జాబితాను కూడా ప్రకటించింది.

సాధారణంగా బ్యాంకుల పని కోసం చాలా మంది వెళ్తుంటారు. అయితే ముందస్తుగా బ్యాంకు సెలవులను తెలుసుకుని ప్లాన్‌ చేసుకుంటే సమయం వృథా కాకుండా చూసుకోవచ్చు. కొంత ఆర్థిక నష్టం కూడా వాటిల్లకుండా జాగ్రత్త పడొచ్చు. ప్రతి నెలా పండుగలు, వారాంతాల్లో కూడా దేశవ్యాప్తంగా ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులకు సెలవులు ఉంటాయి. అయితే ఆర్​బీఐ విడుదల చేసిన జాబితాలో బ్యాంకుల సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించకపోవచ్చు. ఆయా రాష్ట్రాల పండుగలు, ఇతర కార్యక్రమాలను బట్టి ఉంటాయని గమనించాలి. మరి మే నెలలో ఏఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో తెలుసుకుందాం.

  • మే 1 (సోమవారం): కార్మిక దినోత్సవం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, అసోం, తమిళనాడు, కేరళ, బంగాల్, బిహార్, గోవాలో బ్యాంకులకు సెలవు.
  • మే 5 (శుక్రవారం): బుద్ధపూర్ణిమ సందర్భంగా మే5న బంగాల్, దిల్లీ, మహారాష్ట్ర, ఛత్తీస్‍గఢ్, త్రిపుర, మిజోరం, మధ్యప్రదేశ్, చండీగఢ్, ఉత్తరాఖండ్, జమ్ము, ఉత్తర ప్రదేశ్, ఝార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడి ఉంటాయి.
  • మే 7 (ఆదివారం): దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.
  • మే 9 (మంగళవారం): రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి.. బంగాల్​లో అన్ని బ్యాంకులకు సెలవు
  • మే 13 (రెండో శనివారం): దేశంలో బ్యాంకులు అన్నింటికీ సెలవు.
  • మే 14 (ఆదివారం): దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.
  • మే 16 (మంగళవారం): త్రిపుర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా త్రిపురలోని అన్ని బ్యాంకులకు సెలవు.
  • మే 21 (ఆదివారం): దేశవ్యాప్తంగా బ్యాంకులు పని చేయవు.
  • మే 22 (సోమవారం): మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా హిమాచల్ ప్రదేశ్‍లోని బ్యాంకులకు సెలవు.
  • మే 24 (బుధవారం): కజి నజ్రుల్ ఇస్లామ్ జయంతి సందర్భంగా త్రిపురలో మే 24న బ్యాంకులు మూతపడి ఉంటాయి.
  • మే 27 (నాలుగో శనివారం): దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు.
  • మే 28 (ఆదివారం): దేశంలోని అన్ని బ్యాంక్​లకు సెలవు.

మే నెలలో తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు ఏడు రోజులు మూతపడి ఉంటాయి. బ్యాంకులకు సెలవులు ఉన్న రోజుల్లో నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ యాప్‍ల ద్వారా కస్టమర్లు లావాదేవీలు చేసుకోవచ్చు. వీటి ద్వారా డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. బ్యాంకులకు సెలవు ఉన్నా.. ఏటీఎంలు తెరిచే ఉంటాయి. నగదు విత్‍డ్రా చేసుకోవాలంటే కస్టమర్లు ఏటీఎంలో చేసుకోవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.