ఆర్థిక సంవత్సరం 2021-22కు సంబంధించి ఆదాయ పన్ను రిటర్నులు ఫైల్ చేయడానికి ఆఖరు తేదీ ఈ ఏడాది జులై 31. అయితే, ఇప్పటి వరకు కూడా రిటర్నులు ఫైల్ చేయని వారు చాలా మందే ఉన్నారు. మరి వీరు ఇప్పుడు ఐటీఆర్ ఫైల్ చేసే అవకాశం ఉంటుందా? ఉంటే ఎలా చేయాలి? ఇప్పుడు చూద్దాం..
ఎప్పటి వరకు చేయొచ్చు?
గత ఆర్థిక సంవత్సరానికిగాను ఐటీఆర్ ఫైల్ చేయని వారు 'బిలేటెడ్ ఐటీఆర్' ఫైల్ చేసే అవకాశం ఉంటుంది. దీనికి ఆఖరు తేదీ 2022, డిసెంబర్ 31. అలాగే, ఇప్పటికే ఐటీఆర్ ఫైల్ చేసిన వారు అందులో ఏవైనా తప్పులుంటే ఈ తేదీలోపు తిరిగి రివైజ్డ్ రిటర్న్ ఫైల్ చేసి సరిదిద్దుకోవచ్చు.
ఎలా చేయొచ్చు?
బిలేటెడ్ ఐటీఆర్, సాధారణ రిటర్నుల్లాగనే ఉంటుంది. అయితే, ఫైల్ చేసే సమయంలో సెక్షన్ 139(4) సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే, ఏవైనా పెనాల్టీ, ఛార్జీలు, పన్నులు చెల్లించాల్సి ఉంటే వెంటనే చెల్లించాలి. రూ.5 లక్షల వరకు ఆదాయం గల వారు రూ.1000 వరకు పెనాల్టీ చెల్లించాల్సి రావచ్చు. ఇతరులకు ఇది రూ.5000 వరకు ఉంటుంది.
చివరిగా:
రిటర్నులు ఫైల్ చేశాఖ 30 రోజుల్లోపు ఇ-వెరిఫై చేయడం మర్చిపోవద్దు. వెరిఫై చేయని రిటర్నులు ప్రాసెస్ చేయరు. ఇప్పటి వరకు ఫైల్ చేయని వారు లేదా ఫైల్ చేసిన రిటర్నుల్లో తప్పులు చేసిన వారు పైన తెలిపిన తేదీలోపు ఫైల్ చేసి జాగ్రత్త పడొచ్చు. లేదంటే, ఆ తరవాత నోటీసులు పొందే అవకాశం ఉంటుంది.