ETV Bharat / business

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్​పై భారీ ఆఫర్ - ఏకంగా రూ.19వేలు తగ్గింపు!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 1, 2023, 5:27 PM IST

Komaki LY e-Scooter : బడ్జెట్​ ధరలో మంచి ఎలక్ట్రిక్ స్కూటర్​ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే.. మీకోసమే ఓ భారీ ఆఫర్ సిద్ధంగా ఉంది. సింగిల్​ చార్జ్​లో 100 కిలోమీటర్లు నడిచే ఓ టూ వీలర్.. ఊహించని డిస్కౌంట్​తో వస్తోంది.

Komaki LY e Scooter
Komaki LY e Scooter

Komaki LY e-Scooter on Huge Discount : ప్రస్తుతం దేశీయ మార్కెట్​లో ఎలక్ట్రిక్ వాహనాలు పెద్ద ఎత్తున లాంచ్ అవుతున్నాయి. అందులో స్కూటర్లకు ఫుల్ డిమాండ్ ఉంది. పురుషులు, మహిళలు ఈజీగా వినియోగించుకునే వీలుండటం, సిటీ పరిధికి సరిగ్గా సరిపోతుండటంతో.. వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనేక కంపెనీలు విద్యుత్ శ్రేణి స్కూటర్లను(Electric Scooters) భారత మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలోనే జపాన్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీదారు కొమాకి.. తమ బ్రాండ్ నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్​పై భారీ వింటర్ డిస్కౌంట్​ ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Komaki LY e-Scooter Price : అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చిన కొమాకి LY e-స్కూటర్.. చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. Komaki LY e - స్కూటర్‌పై దాదాపు రూ. 19 వేల వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ఈ ఆఫర్ పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంది. ఎవరైనా కొనుగోలు చేయాలని అనుకుంటే.. వెంటనే షోరూమ్​ను సంప్రదించండి. ఈ స్కూటర్​ బ్యాటరీ రేంజ్ ఎంత? ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? డిస్కౌంట్ పోనూ ఎంత ధరకు లభిస్తుంది? అనే విషయాలు తెలియాలంటే.. ఈ స్టోరీ పూర్తిగా చదవండి.

Best Sporty 125cc Scooters 2023 : బెస్ట్​ స్పోర్టీ స్కూటర్​ కొనాలా? 125సీసీ కెపాసిటీ ఉన్న టాప్​ 5 మోడల్స్​ ఇవే!

బ్యాటరీ, రేంజ్ : కొమాకి ఎల్​వై ఇ-స్కూటర్​లో 62V30AH సామర్థ్యంతో కూడిన బ్యాటరీని అమర్చారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీని ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 80-100 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు. ఈ స్కూటర్ డిజైన్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే దీనిలో అధునాతన సాంకేతికతతో కూడిన ఫీచర్లు ఉన్నాయి.

ఫీచర్లు : ఆన్​బోర్డ్ నేవిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ, సౌండ్ సిస్టమ్, కాలింగ్ ఆప్షన్స్ లాంటి ఫీచర్లు ఉండే TFT డిస్​ప్లే ఉన్నాయి. అలాగే క్రూజ్ కంట్రోల్ ఫీచర్ ఉంది. ఎల్​ఈడీ ఫ్రంట్ వింకర్స్, పార్కింగ్ అసిస్ట్స్, రివర్స్ అసిస్ట్స్​తో సహా పలు ఫీచర్స్ ఈ స్కూటర్ సొంతం.

ధర విషయానికొస్తే.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్​ను కొనడానికి ప్రధాన కారణాల్లో.. దీని ధర కూడా కీరోల్​ ప్లే చేస్తోంది. ఈ స్కూటర్ ఎక్స్​ షో రూమ్ ధర రూ. 96,968గా ఉంటే.. వింటర్​ డిస్కౌంట్​లో భాగంగా దీనిపై రూ.18,968 తగ్గిస్తున్నారు. అంటే.. కొమాకి ఎల్​వై ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు రూ.78,000కి లభిస్తోందన్నమాట. మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే ఆలోచనలో ఉంటే ఈ అవకాశాన్ని ఓ సారి పరిశీలించండి. ఈ ఆఫర్ పరిమిత సమయం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

దారిలో మీ స్కూటీ ఛార్జింగ్ అయిపోయిందా? నో టెన్షన్​-ఈ టిప్స్​ ఫాలో అవ్వండి!

Best Scooters Under 1 Lakh : అమ్మాయిలకు సూట్​ అయ్యే బెస్ట్​ స్కూటీస్​ ఇవే.. ధర రూ.1 లక్షలోపే.. ఫీచర్స్​ అదుర్స్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.