Kia Seltos facelift launched : ప్రముఖ దక్షిణ కొరియా వాహన తయారీ సంస్థ కియా భారత మార్కెట్లో సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను లాంఛ్ చేసింది. మిడ్ సైజ్ ఎస్యూవీ సెల్టోస్‌లో ఆధునికీకరించిన మోడల్‌ను రూ.10.89 లక్షలు (ఎక్స్‌షోరూం) ధరకే అందుబాటులోకి తెచ్చింది.
ఈ లేటెస్ట్ కియా సెల్టోస్ వాహనం ఎక్స్‌లైట్, జీటీ లైన్, టైక్ లైన్ అనే మూడు వేరియంట్లలో లభిస్తోంది. అలాగే ఇది పెట్రోల్, డీజిల్ రెండు పవర్ట్రైన్లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉందని కియా స్పష్టం చేసింది.
కియా సెల్టోస్ స్పెసిఫికేషన్స్
Kia seltos facelift specifications : కొత్త కియా సెల్టోస్‌లో అత్యాధునిక డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ ఉంది. అలాగే (ఏడీఏఎస్-2)లో మంచి భద్రతా ఫీచర్లు, ఆధునిక సాంకేతికను పొందుపరిచారు. కియా సెల్టోస్ డ్యూయెల్ టోన్ వేరియంట్లతో సహా, ఎనిమిది ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. అలాగే ఈ కార్లను మూడు ఇంజిన్ వేరియంట్లతో అందుబాటులోకి తేవడం జరిగింది.
- 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. దీనిలో ఐవీటీ గేర్ ఆప్షన్లు కూడా ఉంటాయి.
- 1.5 లీటర్ డీజిల్ వేరియంట్ 6 స్పీడ్ ఐఎంటీ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. అలాగే 6 స్పీడ్ ఆటోగేర్ ట్రాన్స్‌మిషన్‌తో తీసుకొచ్చారు.
- ఈ కియో సిల్టోస్లో కొత్తగా 1.5 లీటర్ పెట్రోల్ టీ-జీడీఐ ఇంజిన్ వేరియంట్‌ను తీసుకొచ్చారు. ఇందులో 6 స్పీడ్ ఐఎంటీ గేర్, 6 స్పీడ్ ఆటోగేర్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లు ఉన్నాయి.
కియా సెల్టోస్ ఎక్స్టీరియర్ ఫీచర్స్
- Kia seltos facelift exterior features : కియా సెల్టోస్ సరికొత్త మోడల్స్‌లో ADAS ష్యూట్, పనోరమిక్ సన్‌రూఫ్ ఉన్నాయి. ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్, ఎల్ఈడీ లైట్ బార్ ఉన్నాయి. అలాగే 18 అంగుళాల క్రిస్టల్ కట్ గ్లాసీ బ్లాక్ అలాయ్ వీల్స్ పొందుపరిచారు. ఫాక్స్ డ్యూయల్ ఎగ్జాస్ట్ టిప్, ఫాక్స్ స్కిడ్ ప్లేట్ అమర్చారు.
- kia seltos facelift interior features : కారులోపలి భాగంలో 10.2 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అమర్చారు. ఇందులో కియా హోమ్ స్మార్ట్ కనెక్ట్ ఫీచర్, 360 డిగ్రీ కెమెరా, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 8 అంగుళాల హడ్-అప్ డిస్ప్లే, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్ ఫీచర్లు ఉన్నాయి.
- Kia seltos facelift safety features : భద్రతా ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు ఉన్నాయి. ఈఎస్సీ, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్, టీపీఎంఎస్, త్రీపాయింట్ సీట్ బెల్ట్ ఉన్నాయి.
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ధరలు
- Kia seltos facelift Price : కియా సెల్టోస్ లేటెస్ట్ ధరలు ఎక్స్-షోరూం ధరలు రూ.10.90 లక్షల నుంచి రూ.19.99 లక్షల శ్రేణిలో ఉంచడం జరిగింది.
- Kia seltos facelift booking : కియా సెల్టోస్ బుకింగ్స్ గత వారమే ప్రారంభమయ్యాయి. టోకెన్ అమౌంట్ రూ.25,000 చెల్లించి, ఈ వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు. మొదటి రోజే 13,424 బుకింగ్‌లు జరిగినట్లు కియా కంపెనీ తెలిపింది.
పోటాపోటీగా
Kia seltos facelift rivals : ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హ్యూందాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టొయోటా అర్బన్ క్యూయిజర్ హైరైడర్, ఎంజీ ఆస్టర్, వోక్స్వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్లకు.. కియా సెల్టోస్ పోటీగా నిలువనుంది. అలాగే దీనికి త్వరలో రానున్న హోండా ఎలివేట్, సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ పోటీగా నిలువనున్నాయి.