ETV Bharat / business

రూ.5,999కే ఇండిగో ఎయిర్​లైన్స్​ హాలీడే ప్యాకేజ్​ - ఫారిన్ టూర్స్​కు కూడా! - ఇండిగో ఎయిర్​లైన్స్​ క్రిస్మస్ హాలీడే ప్యాకేజ్​

IndiGo Airlines Holiday Packages 2023 In Telugu :క్రిస్మస్​, ఇయర్ ఎండింగ్​ హాలీడేస్​ను ఎంజాయ్ చేయడానికి సిద్ధమవుతున్న వారందరికీ గుడ్ న్యూస్​. ఇండిగో ఎయిర్​లైన్స్​ ఈ శీతాకాల సెలవుల కోసం మంచి హాలీడే ప్యాకేజీలను ప్రకటించింది. మరెందుకు ఆలస్యం వాటిపై ఓ లుక్కేద్దాం రండి.

IndiGo Airlines winter holiday packages 2023
IndiGo Airlines holiday packages 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 10, 2023, 4:00 PM IST

IndiGo Airlines Holiday Packages 2023 : భారతీయ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్​లైన్స్​ తమ కస్టమర్ల కోసం ఆకర్షణీయమైన వింటర్ హాలీడే ప్యాకేజీలను ప్రకటించింది. దేశీయ ప్రయాణాలకు మాత్రమే కాదు.. అంతర్జాతీయ పర్యటనలపై కూడా బంపర్​ ఆఫర్లను ప్రకటించింది.

IndiGo Airlines All in one Travel Packages : ఇండిగో ఎయిర్​లైన్స్ కేవలం రూ.5,999కే​ గోవా ఆల్​-ఇన్-వన్​​ ట్రావెల్ ప్యాకేజీని అందిస్తోంది. దీనితో పాటు ఇతర దేశీయ పర్యటనలకు కూడా మంచి ప్యాకేజీలను అందిస్తోంది. వాటి వివరాలు..

హిమాచల్రూ.16,200
అండమాన్రూ.32,700
కశ్మీర్రూ.8,672
కేరళరూ.20,300
లద్ధాఖ్​ రూ.29,100
రాజస్థాన్రూ. 20,100
ఈశాన్య రాష్ట్రాలురూ.18,300

IndiGo Airlines International Travel Packages : ఇండిగో ఎయిర్​లైన్స్​ అంతర్జాతీయ పర్యటనలపై కూడా స్పెషల్ ప్యాకేజీలను అందిస్తోంది. ముఖ్యంగా రూ.62,000కే దుబాయి ఆల్​-ఇన్-వన్ ట్రావెల్ ప్యాకేజ్ అందిస్తోంది. రూ.34,000కే మాల్దీవ్స్​కు టూర్ ప్యాకేజ్​ ఇస్తోంది.

స్వేచ్ఛగా విహరిస్తున్నారు!
దేశంలో నేడు పర్యాటకానికి విపరీతంగా డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా యువతీ, యువకులు తమకు నచ్చిన ప్రదేశాలను చుట్టి రావడానికి ఇష్టపడుతున్నారు. దీనికి తోడు త్వరలో క్రిస్టమస్​, నూతన సంవత్సరం వేడుకలు ప్రారంభం కానున్నాయి. అందువల్ల హనీమూన్ జంటలు, యువతీ యువకులు, ఫ్యామిలీలు.. టూర్స్​ ప్లాన్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా గోవా, కశ్మీర్​, కేరళ, రాజస్థాన్​, హిమాచల్​, అండమాన్​ నికోబార్ దీవులు లాంటి సుందర ప్రకృతి దృశ్యాలు ఉండే ప్రాంతాలను వీక్షించడానికి ఇష్టపడుతున్నారు. మరికొందరు ఇతర దేశాలకు వెళ్లి, అక్కడి ప్రకృతి అందాలను, నగరాలు, పర్వతాలు, బీచ్​లను సందర్శించాలని ఉవ్విళ్లూరుతున్నారు. దీనిని క్యాష్​ చేసుకునేందుకే ఇండిగో ఎయిర్​లైన్స్ తాజాగా వింటర్​ ట్రావెల్ ప్యాకేజ్​లను ప్రకటించింది.

విదేశీ పర్యటనలు పెరిగాయి!
ఓ ట్రావెల్ కంపెనీ నివేదిక ప్రకారం, ఇటీవలి కాలంలో అండమాన్​, గోవా, హిమాచల్​ప్రదేశ్, కేరళ, కశ్మీర్​, రాజస్థాన్, ఉత్తరాఖండ్​ లాంటి దేశీయ పర్యాటక ప్రదేశాల సందర్శనకు విపరీతంగా డిమాండ్ పెరుగుతోంది. అలాగే అబుదాబి, దుబాయ్, ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్​, వియత్నాం లాంటి అంతర్జాతీయ పర్యటనలు కూడా ఊపందుకుంటున్నాయి. ఆయా దేశాల వీసాలు చాలా సులువుగా లభిస్తుండడమే ఇందుకు కారణం. అందుకే భారతీయులు ఈ దేశాలకు వెళ్లడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. వీటితోపాటు ఐరోపా, సింగపూర్​ల్లో జరిగే ప్రఖ్యాత క్రిస్మస్ వేడుకలను చూడడానికి కూడా భారతీయులు ఇష్టపడుతున్నారని సదరు నివేదిక పేర్కొంది.

కాలేజ్ స్టూడెంట్స్ స్పెషల్​ - రూ.2 లక్షల​ బడ్జెట్లోని టాప్-10 బైక్స్ ఇవే!

2024లో లాంఛ్​ కానున్న టాప్​-6 ఫ్యామిలీ కార్స్ ఇవే! ధర ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.