ETV Bharat / business

'యూపీఐ లావాదేవీలపై 0.3శాతం ఛార్జ్!.. ఏటా కేంద్రానికి రూ.5,000 కోట్లు' - డిజిటల్​ చెల్లింపులపై ఛార్జ్​లు

గూగుల్​ పే, ఫోన్​ పే ద్వారా చేసే UPI లావాదేవీలపై కొంత ఛార్జ్​ని విధించాలంటూ ఐఐటీ బాంబే ఓ నివేదిక విడుదల చేసింది. యూపీఐ వినియోగదారుడు చేసే లావాదేవీలపై 0.3 శాతం ఛార్జ్​ను విధించాలని ప్రభుత్వానికి సూచించింది ఈ నివేదిక. అలా చేస్తే ప్రభుత్వానికి ఏటా రూ.5,000 కోట్లు వస్తాయని వెల్లడించింది.

upi transaction charges 2023
upi transaction charges 2023
author img

By

Published : Apr 2, 2023, 8:07 PM IST

యూపీఐ లావాదేవీలపై కొంత మొత్తాన్ని ఛార్జ్​గా విధించాలని.. ఐఐటీ బాంబే ఓ నివేదికను విడుదల చేసింది. గూగుల్​ పే, ఫోన్​ పే, పేటీఎం ద్వారా చేసే యూపీఐ లావాదేవీలపై ప్రభుత్వం 0.3 శాతం ఛార్జ్​ను విధించాలని ఆ నివేదిక సూచింది. యూపీఐ ట్రాన్సాక్షన్​ ఆమోదించడం, ప్రాసెస్ చేయడం, పూర్తి చేయడానికి సంబంధించిన ఖర్చుల దృష్ట్యా ఆ ఛార్జ్​లను విధించాలని తెలిపింది. దీని ద్వారా ఏటా 5,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి సమకూరుతాయని తెలిపింది. ఈ మొత్తాన్ని యూపీఐ వ్యవస్థను బలపేతం చేయడానికి ఉపయోగించుకోవచ్చని సూచించింది.

యూపీఐ వ్యవస్థ నిర్వహణకు అవసరమైన ఖర్చును వినియోగారుల నుంచే వసూలు చేయాలంటూ ఐఐటీ బాంబే 'పీపీఐ-ఆధారిత యుపీఐ చెల్లింపుల కోసం ఛార్జీలు- ది డిసెప్షన్' పేరుతో రిపోర్ట్ విడుదల చేసింది. యూపీఐ యూజర్​ చేస్ ప్రతి లావాదేవీపై 0.3 శాతం ఛార్జ్​ను వసూలు చేయాలని కేంద్రానికి సూచించింది. యూపీఐ లావాదేవీలపై 0.3 శాతం రుసుమును ప్రభుత్వం వసూలు చేస్తే.. 2023-24లో దాదాపు రూ. 5,000 కోట్లు సమకూరుతాయని ఈ అధ్యయనం పేర్కొంది.

యూపీఐ ద్వారా చేసే మర్చంట్ లావాదేవీలపై ప్రీపెయిడ్ పేమెంట్స్​ ఇన్​స్ట్రుమెంట్స్- పీపీఐ​ ఫీజును 2023 ఏప్రిల్​ 1 నుంచి వసూలు చేయనున్నట్లు జాతీయ చెల్లింపుల సంస్థ- ఎన్​పీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. పీపీఐ ద్వారా రూ.2000 కంటే ఎక్కువ మొత్తం ట్రాన్స్​ఫర్​ చేస్తే 1.1 శాతం సర్​ఛార్జ్​ విధిస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా వ్యాపారస్తులపై మాత్రమే ఈ భారం పడుతుంది. వ్యాపారస్తులు తమపై పడే భారాన్ని.. వినియోగదారుల నుంచే వసూలు చేస్తారని ఈ నివేదిక అభిప్రాయపడింది. ఎన్​పీసీఐ కొత్తగా తీసుకువచ్చిన పీపీఐ ఛార్జ్​ కారణంగా.. వినియోగదారులకు వస్తువులపై డిస్కౌంట్​ లేకుండాపోతుందని నివేదించింది.

ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం.. యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే వ్యక్తి, వాటిని స్వీకరించే వ్యక్తి నుంచి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎటువంటి ఛార్జ్​లు విధించకూడదు. దీంతో వినియోగదారులు బ్యాంక్​ ద్వారా, యూపీఐ ద్వారా చేస్తున్నఅన్ని లావాదేవీలు ఉచితం. అయితే కొత్తగా తీసుకువచ్చిన పీపీఐ సర్​ఛార్జ్​ ద్వారా వ్యాపారస్తులపై మాత్రమే ఛార్జ్ విధించినా ఆ భారం మాత్రం.. సాధారణ వినియోగదారులపైనా ఉంటుందని ఈ నివేదిక తెలిపింది.

ప్రతి ఏటా కరెన్సీ ప్రింటింగ్, నిర్వహణపై.. ప్రభుత్వం, ఆర్‌బీఐ అధికంగా ఖర్చు చేస్తున్నాయని ఐఐటీ బాంబే ప్రొపెషర్​ ఆశిశ్ దాస్ ఈ నివేదికలో వెల్లడించారు. గత కొన్నేళ్లుగా సగటున కరెన్సీ ప్రింటింగ్‌పైనే ఏటా రూ.5,400 కోట్లు ఖర్చు చేశారని, కరెన్సీ నిర్వహణపై ఇంకా ఎక్కువ ఖర్చు చేశారని ఈ నివేదికలో పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం కరెన్సీ కోట్ల ప్రింటింగ్​, నిర్వహణకు చేసే ఖర్చు కంటే.. యూపీఐ నిర్వహణ కోసం చేసే వ్యయం చాలా తక్కువగా ఉంటుందని ఈ నివేదిక తెలిపింది. కాబట్టి.. యూపీఐ ద్వారా వ్యక్తి నుంచి వ్యక్తికి, వ్యక్తి నుంచి వ్యాపారికి చేసే లావాదేవీలపై 0.3 శాతం విస్తే.. దాదాపుగా సంవత్సరానికి రూ.5,000 కోట్లు వచ్చే అవకాశం ఉందని ఈ నివేదిక వెల్లడించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.