How To Submit Life Certificate Via Face Authentication : ఉద్యోగం చేసి రిటైర్ అయినవారు, సీనియర్ సిటిజన్లు తమకు ప్రతి నెలా పెన్షన్ రావాలంటే.. ప్రతి ఏడాదీ కచ్చితంగా జీవిత ధ్రువీకరణ పత్రాన్ని (వారు జీవించి ఉన్నారని రుజువు చేసే పత్రం) సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడే వారి పెన్షన్ ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగుతుంది. ఈ జీవిత ధ్రువీకరణ పత్రాన్నే 'జీవన్ ప్రమాణ్ పత్ర' అని కూడా పిలుస్తారు. అయితే దీన్ని సమర్పించడానికి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. కానీ ఈ లేటు వయస్సులో వారికి అంత ఓపిక ఉండదు.
ఆన్లైన్లో లైఫ్ సర్టిఫికెట్!
Life Certificate Online Submission Process : మన దేశంలో దాదాపు 69.76 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు ఉన్నారు. ముఖ్యంగా 80 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్లను సూపర్ సీనియర్ పెన్షనర్లు అంటారు. వీరికి జీవన్ ప్రమాణ్ పత్రాన్ని సమర్పించడంలో ఎన్నో అవాంతరాలు ఎదురవుతాయి. అందుకే ఇలాంటి సమస్యకు చెక్ పెడుతూ.. ఆన్లైన్లోనే లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేందుకు కేంద్రం ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని తీసుకువచ్చింది. దీని ద్వారా తాము ఉన్న ప్రాంతం నుంచే లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించుకోవచ్చు.
ఈ ప్రక్రియ అక్టోబర్ 1న ప్రారంభమైంది. పెన్షనర్లు సాధారణంగా తమ దగ్గర్లోని బ్యాంకులు లేదా పోస్టాఫీసులను సందర్శించి ధ్రువపత్రాలు సమర్పించవచ్చు. లేదా ఆన్లైన్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఇక మిగిలినవారు అంటే 80 ఏళ్లలోపు పెన్షనర్లు తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని ఇవ్వడానికి నవంబరు వరకు గడువు ఉంది.
"ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని ఉపయోగించి లైఫ్ సర్టిఫికెట్ పొందే సౌలభ్యం గురించి అవగాహన కల్పించడానికి అన్ని బ్యాంకులు వివిధ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించుకోవచ్చు" అని పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ (DoPPW) గత నెల 25 న జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొంది.
ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని ఉపయోగించి లైఫ్ సర్టిఫికెట్ ఎలా సమర్పించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Digital Life Certificate Submission Through Face Authentication :
- ముందుగా పింఛనుదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ‘Aadhaar Face RD (ఎర్లీ యాక్సెస్) అనే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి.
- దీంతో పాటు జీవన్ ప్రమాణ్ అనే యాప్‌ను కూడా డౌన్లోడ్ చేసుకోవాలి.
- ఇప్పుడు, జీవన్ ప్రమాణ్ యాప్ ఓపెన్ చేసి అందులో ఆధార్, మొబైల్ నంబర్లు, ఈ మెయిల్ ఐడి లాంటి వ్యక్తిగత వివరాలు నింపి, సబ్మిట్ చేయండి.
- తర్వాత మీ మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడీకి ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయండి.
- ఆధార్ కార్డులో ఉన్న పేరు ఎంటర్ చేసి స్కాన్ ఆప్షన్ ఎంచుకోండి.
- ఆ యాప్ మీ ముఖం స్కాన్ చేయడానికి కెమెరా పర్మిషన్ అడుగుతుంది. ఓకే పైన క్లిక్ చేయండి.
- తర్వాత ‘I am aware of this’ అనే బటన్ పై ప్రెస్ చేయండి. తర్వాత మీ ఫేస్ స్కాన్ అవుతుంది.
- ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత.. మీ వివరాలు సబ్మిట్ అయినట్లు చూపిస్తుంది. తరువాత..
- ఫోన్ స్క్రీన్‌పై పెన్షనర్ల ప్రమాణ్ ID, PPO నంబర్లు కనిపిస్తాయి.
విస్తృత ప్రచారానికి శ్రీకారం
పెన్షనర్లకు, పెన్షన్ డిస్బర్సింగ్ అథారిటీలకు.. ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ గురించి అవగాహన కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా.. నవంబర్1 నుంచి నంబర్ 30 వరకు ప్రచారం చేయనుంది.
Ola Bharat EV Fest Offers : ఓలా ఫెస్టివ్ ఆఫర్స్.. ఆ ఈవీ స్కూటర్‌పై ఏకంగా 50% డిస్కౌంట్!