How to Improve Car Battery Life : కారులో ఎల్లప్పుడూ హెల్దీ బ్యాటరీ ఉండటం చాలా అవసరం. కానీ.. సరైన మెయింటినెన్స్ లేకపోతే.. కొత్త బ్యాటరీ వేసినా అది కొన్నాళ్లకే దెబ్బ తింటుంది. కాబట్టి కారు బ్యాటరీ లైఫ్ టైమ్ పెరగాలంటే తప్పకుండా కొన్ని టిప్స్ పాటించాలి. అవేంటో ఇక్కడ చూద్దాం.
తక్కువ డిస్టెన్స్ కోసం కారు వద్దు..
కారును స్టార్ట్ చేయడానికి కొంత బ్యాటరీ ఛార్జ్ అవసరమవుతుంది. ఆ తర్వాత జర్నీలో ఇంజిన్ నడుస్తుంది కాబట్టి.. బ్యాటరీ రీఛార్జ్ అవుతుంది. అయితే.. దూరం వెళ్లేప్పుడు మాత్రమే ఈ పరిస్థితి ఉంటుంది. కొద్ది దూరం వరకే కారు నడిస్తే.. కోల్పోయిన శక్తిని బ్యాటరీ తిరిగి పొందడం సాధ్యంకాదు. ఇలా తరచూ జరిగే బ్యాటరీలో లో-వోల్టేజీ సమస్య తలెత్తుంది. బ్యాటరీ వీక్ అయిపోవడం మొదలవుతుంది.
అస్సలే కారు తీయకుండా ఉండొద్దు..
చిన్న దూరాలకు కారు తీయడం కారుకు ఎంత ఇబ్బందో.. అస్సలు బయటికి తీయకపోవడం కూడా అంతే ఇబ్బంది! ఎక్కువ కాలం కారును స్టార్ట్ చేయకపోవడం వల్ల బ్యాటరీ క్రమంగా డిశ్చార్జ్ అయిపోతుంది. దీనివల్ల కారు ఆన్ అవ్వకుండా పోయే ఛాన్స్ ఉంది. కాబట్టి.. కనీసం వారానికి ఒక్క సారైనా ఓ అరగంట పాటు కారును రన్నింగ్‌లో ఉంచడం మంచిది. తద్వారా.. బ్యాటరీ లైఫ్ కూడా పెరుగుతుంది.
మీ కారులో ఆడియో సిస్టమ్ ఇబ్బంది పెడుతోందా? - ఇలా మెయింటెయిన్ చేయండి!
లైట్స్ ఆన్ చేయకూడదు..
చాలా మంది రాత్రి వేళ డ్రైవింగ్ సీట్లో కూర్చున్న తర్వాత.. కారు స్టార్ట్ చేయకుండానే ఇంటీరియర్ లైట్లు, హెడ్‌లైట్లు ఇతర ఎలక్ట్రానిక్ డివైజెస్ ఆన్ చేస్తారు. దీనివల్ల.. బ్యాటరీ వేగంగా డిశ్చార్జ్ అయిపోతుంది. ఇంజన్ ఆన్‌లో లేకపోతే.. బ్యాటరీని చార్జ్ చేసే ఆల్టర్నేటర్ కూడా ఆఫ్ లో ఉంటుందని మరిచిపోవద్దు. సో.. ఇంజన్ ఆఫ్‌లో ఉన్నప్పుడు కారులోని ఎలక్ట్రానిక్ డివైజెస్ వాడొద్దు.
అన్నీ ఆఫ్ చేయండి..
కారును పార్క్ చేసి వెళ్లడానికి ముందు.. లోపల ఉన్న డివైజెస్ అన్నీ ఆఫ్ చేశారా? లేదా? అని చెక్ చేయండి. అదేవిధంగా కారును "లాక్" చేయడం అస్సలే మరిచిపోవద్దు. కారు "ఓపెన్" మెమొరీలో ఉంచినట్లయితే.. బ్యాకెండ్ లో "కంప్యూటర్ సిస్టమ్" రన్ అవుతూనే ఉండొచ్చు. దీనివల్ల కారు బ్యాటరీ డిశ్చార్జ్ అవుతూనే ఉంటుంది.
బ్యాటరీని క్లీన్ చేయండి..
కారు బ్యాటరీపై దుమ్ము పేరుకుపోతే.. అది తేమను సృష్టించొచ్చు. తద్వారా షార్ట్ సర్క్యూట్ ప్రమాదం కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. సో.. నెలకోసారైనా బ్యాటరీని క్లీన్ చేయాలి. స్పాంజ్ లేదా పొడి క్లాత్‌తో సులభంగా క్లీన్ చేయండి.
రెగ్యులర్ సర్వీస్..
వీటన్నింటితోపాటు టైమ్ టూ టైమ్ తప్పకుండా సర్వీస్ చేయించాలి. ఆ సమయంలో బ్యాటరీ కండీషన్ చెక్ చేయమని మెకానిక్కు చెప్పండి. రీఛార్జ్ సరిగా అవుతోందా? ఏవైనా లోపాలు ఉన్నాయా? అని కూడా అడిగి తెలుసుకోండి. ఈ పనులన్నీ తప్పకుండా చేసినప్పుడు.. బ్యాటరీ జీవిత కాలం మరింతగా పెరుగుతుంది.