How To Get Job In Google : ప్రపంచంలోనే ప్రముఖ దిగ్గజ సంస్థలైన గూగుల్, మెటా లాంటి సంస్థల్లో పనిచేయాలని చాలా మంది అనుకుంటారు. అలాంటి సంస్థలు ఇచ్చే భారీ వేతనాలు, కల్పించే ఇతర సౌకర్యాలే అందులో చేరేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపడానికి ముఖ్య కారణం. అయితే గూగుల్‌లో జాబ్సాధించడం అంత సులువేం కాదు.. అయినప్పటికీ ప్రయత్నిస్తే అసాధ్యమేమీ కాదు. గూగుల్‌లో ఎలా ఉద్యోగం పొందవచ్చు? ఆ సంస్థలో ఉద్యోగాలకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి? గూగుల్‌లో ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందో సవివరంగా తెలుసుకుందాం.
గూగుల్ సెర్చ్టూల్ ఆప్షన్ ద్వారా
ముందుగా మీరు గూగుల్ కెరీర్ సెర్చ్ టూల్ ద్వారా ఫ్రొపైల్ను తయారు చేయాల్సి ఉంటుంది. దీనిలో మీ పూర్తి వివరాలు, గత ఉద్యోగ అనుభవం, మీరు ఎక్కడ పనిచేయాలనుకుంటున్నారనే మొదలైన వివరాలు ఎంటర్ చేయండి.
గూగుల్‌లో ఎలాంటి జాబ్స్ ఉంటాయి?
మీరు మీ ఫ్రొపైల్ను రూపొందించిన తరువాత గూగుల్ కెరీర్ సెర్చ్టూల్ ద్వారా ఏఏ జాబ్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చు. అందులో ఉండే ఫిల్టర్ ఆప్షన్ ద్వారా వివిధ లొకేషన్స్‌లో ఏ ఉద్యోగాలు ఉన్నాయి. ఫుల్‌టైం జాబ్స్, పార్ట్‌టైం జాబ్స్, టెంపరరీ, ఇంటర్న్‌షిప్ మొదలైన ఆఫ్షన్లు ఉంటాయి. ఆయా ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు, అర్హతలు సంస్థల ( Google, GFiber, Waymo, Verify life Sciences, Wing,X, Youtube) వివరాలు ఉంటాయి. మీకు తగిన ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ప్రతి 30 రోజులకు మూడు ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియ ఏవిధంగా ఉంటుంది?
గూగుల్‌లో ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ మిగతా సంస్థలు కన్నా కాస్త భిన్నంగా ఉంటుంది. ఎంపిక ప్రక్రియ ముఖ్యంగా నాలుగు అంచెల్లో ఉంటుంది. అవి అసెస్మెంట్స్, షార్ట్ వర్చువల్ చాట్స్, ప్రొజెక్ట్ వర్క్, ఇంటర్య్వూ. ఈనాలుగు ప్రక్రియలు ఏవిధంగా ఉంటాయో తెలుసుకుందాం.
- అసెస్మెంట్స్ : కోడింగ్ క్విజ్ లాంటి ఆన్లైన్ అసెస్మెంట్లు ఉండవచ్చు. మీకు ఓ ఆన్లైన్ ప్రొజెక్టు ఇచ్చి చెయ్యమని ఇంటర్య్యూ మెంబర్లు కోరే అవకాశం ఉంది.
- షార్ట్ వర్చువల్ చాట్స్ : ఎంపిక చేసే మేనేజర్ లేదంటే రిక్రూటింగ్ టీమ్‌లోని మెంబర్లతో కూడిన షార్ట్ వర్చువల్ చాట్స్‌ను గూగుల్ నిర్వహిస్తుంది. ఇది ఫోన్ లేదా వీడియో మాధ్యమం ద్వారా జరుగుతుంది.
- ప్రొజెక్ట్ వర్క్ : గూగుల్ ఇంటర్యూ ప్రక్రియలో భాగంగా కొన్నిసార్లు అభ్యర్థులను చిన్నచిన్న ప్రాజెక్టులను చేయమని అడగవచ్చు. ఇందులో బాగంగా కొంత సమాచారం ఇచ్చి కోడ్ షాంపిల్స్ రాయమని అడిగే అవకాశం ఉంది.
- ఇంటర్య్వూ : పై మూడు దశలను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు 3-4 ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వీటిని పర్సనల్‌గా లేదా ఫోన్‌ద్వారా నిర్వహించచ్చు. ఈ ఇంటర్య్వూలో అభ్యర్థికి తగిన నైపుణ్యాలు ఉన్నాయా? అనే విషయాన్ని ఎంపిక చేసేవారు పరిశీలిస్తారు. గూగూల్ సంస్థ ఇంటర్య్వూలను రెండు ఫార్మాట్లలో నిర్వహిస్తుంది. అవి స్ట్రక్చరెడ్ ఇంటర్య్యూ, ఓపెన్ ఎండెడ్ ప్రశ్నలు.
- నిర్మాణాత్మక ఇంటర్వ్యూ: ప్రతి అభ్యర్థి స్పష్టమైన రూబ్రిక్‌లను ఉపయోగించి అంచనా వేస్తారు. ఉద్యోగం కోసం ఎంపిక చేయబోయే అభ్యర్థులందరికీ ఒకే విధానం ద్వారా వారి సామర్థ్యాన్ని అంచనా వేస్తారు.
- ఓపెన్ ఎండెండ్ ప్రశ్నలు : ఉద్యోగ ఎంపిక ప్రక్రియలో భాగంగా ఓపెన్ ఎండెండ్ ప్రశ్నలు ఉంటాయి. ఇంటర్యూ ప్యానెల్ సభ్యులు అభ్యర్థి మేధో సామర్థ్యాన్ని అంచనా వేయడానికి వివిధ ప్రశ్నలు అడుగుతారు. టీం మేనేజ్మెంట్, మీకున్న నైపుణ్యాలు, సమస్యలను పరిష్కరించే విధానాన్ని పరిశీలిస్తారు. ఇంటర్య్వూ ప్రక్రియలో మీ వసతి సౌకర్యం అవసరమైతే గూగుల్ సంస్థే ఆ ఏర్పాటు చేస్తుంది. మీ ఇంటర్య్యూలు పూర్తయిన తర్వాత, మీ వివరాలన్నింటిని సమీక్షించి మీరు ఎంపికయినట్లయితే జాబ్ ఆఫర్ లెటర్‌ను పంపిస్తుంది.
డిగ్రీ లేకున్నా ఉద్యోగాలు.. గూగుల్, IBMలోనూ ఛాన్స్.. విమానాలూ నడపొచ్చు!