ETV Bharat / business

How to Enable AutoPay Feature in UPI Apps : మీ ఫోన్​లో 'AutoPay'ను ఇలా సెట్ చేసి.. మంత్లీ బిల్లులు ఈజీగా చెల్లించండి.! - యూపీఐ ఆటోపే తాజా వార్తలు

How to Set up AutoPay Feature in UPI Apps : మీరు తరుచుగా మంత్లీ బిల్స్​ పే చేస్తున్నారా..? ఒక్కోసారి సమయానికి చెల్లించకపోతే పెనాల్టీ కడుతున్నారా..? అయితే ఇది మీ కోసమే. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. AutoPay ఫీచర్​ను మీ ఫోన్​లో సెట్ చేసుకుంటే చాలు. ఇంతకీ ఈ ఫీచర్​ను యూపీఐ యాప్​లలో ఎలా సెట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 22, 2023, 1:01 PM IST

How to Set up AutoPay Feature in UPI Apps in Telugu : నేటి బిజీ లైఫ్​లో ఎవరైనా ప్రతి నెలా లేదా మరేదైనా వ్యవధిలో చెల్లించాల్సిన అన్ని బిల్లులు, పేమెంట్ల తేదీలను గుర్తుంచుకోవడం కాస్త కష్టమే. డిజిటల్ పేమెంట్ యాప్స్(Digital Payments) ద్వారా మీ ఫోన్ బిల్లుల నుంచి ఈఎంఐల వరకు లాస్ట్ పేమెంట్ తేదీలను రిమైండర్​గా సెట్ చేసుకోవచ్చు. అయితే ప్రతిసారీ మాన్యువల్‌గా పేమెంట్లను చేయడం ఇబ్బందికరమైన విషయమే.

AutoPay Set up for Recurring Payments : ఒకవేళ మనం సకాలంలో పేమెంట్లను చేయకపోతే.. అదనపు ఆలస్య రుసుములను చెల్లించాల్సి వస్తుంది. లేదంటే.. కొన్ని సమయాల్లో సర్వీసు నిలిచిపోతుంది. మీరు తరచుగా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారా? అయితే మీ కోసమే అన్ని యూపీఐ యాప్​(UPI Apps)లలో ఆటోపే(Autopay) ఫీచర్​ అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ ఆటో ఫీచర్​ అంటే ఏమిటి? ఇది ఎలా పనిచేస్తుంది? దీనిని యూపీఐ యాప్​లలో ఎలా సెట్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

What is Autopay in Telugu : నెలవారీ పునరావృత పేమెంట్లను సులభతరం చేసేందుకు బ్యాంకింగ్ లేదా యూపీఐ యాప్​లు అందించే ఫీచరే ఈ ఆటోపే(Autopay). ఈ ఫీచర్​ను ఎనేబుల్ చేసుకోవడం ద్వారా గడువు తేదీ రాగానే మీరు నెలవారీ చెల్లించాల్సిన మనీ ఆటో పేమెంట్ అయిపోతుంది. దాదాపు అన్ని బ్యాంకింగ్ యాప్‌లు, ఇతర సర్వీసుల ద్వారా ఆటో పే ఆప్షన్ అందుబాటులో ఉంది.

ఉదాహరణకు ప్రతి నెలా మీరు ఒక నిర్దిష్ట తేదీన మీ ఫోన్​ బిల్లు పే చేయాలనుకుందాం.. అది ప్రతి నెల 5వ తేదీ నుంచి 15వ తేదీలోపు చెల్లించాల్సి ఉంటుందనుకుందాం. ఇలాంటి సందర్భంలో, మీరు ఎలాంటి మాన్యువల్ పేమెంట్ చేయాల్సిన పనిలేదు. ఈ ఆటో ఫీచర్ ద్వారా ఆటోమేటిక్ పేమెంట్ చేయడానికి 5వ తేదీ నుంచి 15వ తేదీల మధ్య నిర్దిష్ట తేదీని సెట్ చేస్తే సరిపోతుంది.

Autopay Benefits in Telugu : ఇలా ఇదొక్కటే కాదు హోమ్ లోన్‌లు(Home Loans), EMI, సకాలంలో చెల్లించాల్సిన బిల్లుల వంటి పెద్ద చెల్లింపుల విషయంలో.. అలగే లేట్ పేమెంట్ లేదా పేమెంట్లు తప్పిన సందర్భంలో బ్యాంకులు విధించే పెనాల్టీ లేదా అదనపు ఛార్జీలను నివారించడానికి ఈ ఆటోపే ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే మీరు OTT సర్వీసుల కోసం నెలవారీ సభ్యత్వాన్ని కలిగి ఉంటే.. ఆ పేమెంట్లను సకాలంలో చేయడానికి ఆటోపేను వాడుకోవచ్చు. ముఖ్యంగా డిజిటల్ పేమెంట్ యాప్స్‌లో Google Pay, Phone Pe, Paytm, వంటి UPI యాప్‌లూ వినియోగదారులకు ఈ ఆటో పే ఆప్షన్ అందిస్తున్నాయి.

How to Work Autopay Feature :

ఆటోపే ఫీచర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం..

  • యూజర్స్ రూపాయి నుంచి రూ. 5వేల మధ్య మొత్తం ఆటో పే పేమెంట్లను సెట్ చేసే అవకాశం ఉంది.
  • అలాగే వినియోగదారులు వారి అవసరాలకు అనుగుణంగా నెలవారీ పేమెంట్లను సవరించడానికి లేదా పాజ్ చేయడానికి లేదా నిలిపివేయడానికీ ఆప్షన్ కలిగి ఉంటారు.
  • అదే విధంగా యూజర్స్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.(పేమెంట్ అవసరం- EMI, బిల్లులు)
  • నెలవారీ పేమెంట్లను UPI పిన్ నమోదు(ఒక పర్యాయం మాత్రమే) చేయడం ద్వారా అథెంటికేషన్ చేసుకోవాలి.
  • అలాగే ప్రతి వారం, నెలవారీ, త్రైమాసిక చెల్లింపులకు ఆటో పే ఆప్షన్ సెట్ చేసే ఆప్షన్​ను పొందుతారు.

Paytm, Gpay, ఇతర UPI యాప్‌లలో ఆటోపే ఫీచర్‌ని ఎలా సెట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

How to Set up Autopay in Paytm Telugu :

Paytmలో ఆటోపేను ఎలా సెటప్ చేసుకోవాలంటే..

  • మొదట Paytm యాప్‌లో మీ బ్యాంక్ ఖాతాలను లైక్ చేయడం ద్వారా మీరు UPI చెల్లింపులను ప్రారంభించారని నిర్ధారించుకోవాలి.
  • ఆ తర్వాత Paytm యాప్‌ని ఓపెన్ చేసి “Automatic Payments” ఆప్షన్​పై సెర్చ్ చేయాలి.
  • అప్పుడు మీరు UPI ఆటోమేటిక్ చెల్లింపుల ఎంపికను ఎంచుకోవాలి.
  • ఆ తర్వాత కుడి ఎగువ మూలలో ఉన్న Setup Now ఎంపికపై నొక్కాలి.
  • మీరు OTT సేవలు, రీఛార్జ్‌లు, బిల్లులు, LIC, పైప్డ్ గ్యాస్ మొదలైన వాటితో సహా అందుబాటులో ఉన్న సేవల్లో ఒకదాన్ని ఎంచుకోవాలి.
  • ఆపై అవసరమైన వివరాలను నమోదు చేసి.. మీరు ప్రతి నెలా UPI చెల్లింపు చేయాలనుకుంటున్న అకౌంట్​ను లేదా సెట్ ఆదేశం ప్రకారం ఖాతాను ఎంచుకోవాలి. అంతే ఇక మీ నెలవారీ చెల్లింపులు ఆటోమెటిక్​గా పేమంట్ చేయబడతాయి.

UPI Credit Line Facility : అకౌంట్​లో డబ్బులు లేకపోయినా UPI పేమెంట్స్.. ఎలాగంటే?

How to Set up Autopay on Gpay in Telugu :

GPayలో ఆటోపేను ఇలా సెటప్ చేసుకోండి..

  • మొదట మీరు Google Pay యాప్‌ని ఓపెన్​ చేయాలి.
  • ఆ తర్వాత యాప్​లో మీ ప్రొఫైల్ పిక్​పై క్లిక్ చేయాలి. ఆపై Autopayను ఎంచుకోవాలి.
  • మీరు ఈ ఆటో పేమెంట్ సెట్టింగ్స్ సవరించవచ్చు లేదా ఉపసంహరించుకోవచ్చు.
  • అలాగే పేమెంట్ అథెంటికేషన్ చేయడం లేదా తిరస్కరించడం వంటి చర్యలు చేయొచ్చు.
  • అదేవిధంగా గడువు ముగిసిన లేదా రద్దు చేసిన పేమెంట్లు వంటి పూర్తి అయిన పేమెంట్లను చెక్ చేసుకునే వీలు ఉంది.
  • అలాగే కొత్త పేమెంట్ క్రియేట్ చేయడానికి.. పెండింగ్‌లో ఉన్న విభాగంలో అవసరమైన ఆప్షన్​ను ఎంచుకోవచ్చు.
  • ఇక చివరగా ఆటోపే సెటప్ చేసి.. అవసరమైన వివరాలను నమోదు చేయండి.
  • అయితే ఒకసారి UPI పిన్‌ని నమోదు చేయడం ద్వారా అథెంటికేట్ చేసుకోవచ్చు.

First Time Gpay Users? How to Guide : మొదటిసారి గూగుల్​ పే వాడుతున్నారా..? అయితే మీ కోసమే ఇది

How to Set up Autopay on BHIM UPI :

BHIM UPIలో ఆటోపేను సెటప్ చేసుకోండిలా..

  • మొదటగా BHIM యాప్‌ని ఓపెన్ చేసి.. ఆటో డెబిట్ ఎంపికను ఎంచుకోవాలి.
  • ఆ తర్వాత Mandate బటన్‌పై నొక్కాలి. ఆపై మీరు కొత్త పేమెంట్ ఆప్షన్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదా ఇదివరకే ఆటోపే ఎంపిక ఉంటే దానిని సెలెక్ట్ చేసుకోవచ్చు.
  • సరిగ్గా సెటప్ చేయడానికి వ్యాపారి పేరు, కస్టమర్ ID మొదలైన అవసరమైన వివరాలను నమోదు చేయాలి.

How to be Safe from UPI Frauds: యూపీఐ మోసం.. తేడావస్తే అంతే.. ఇలా రక్షించుకోండి!

WhatsApp Pay India News : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్​.. ఇకపై నేరుగా యాప్​​లోనే పేమెంట్స్​!

For All Latest Updates

TAGGED:

Autopay
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.