సోషల్ మీడియాను ప్రభావితం చేసేవారికి ఇప్పుడు గుండెల్లో పెద్ద బండరాయి!. కేంద్ర ప్రభుత్వం వారి కోసం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. సోషల్ మీడియా ప్రభావశీలులు.. వారు ఆమోదించే ఉత్పత్తితో తమ అనుబంధాన్ని ప్రకటించాల్సిందేనని వినియోగదారుల వ్యవహారాల విభాగం స్పష్టం చేసింది. అది కూడా స్పష్టమైన భాషలో అర్ధమయ్యేటట్లు చెప్పాలని, నెటిజన్లు అది మిస్ కాకుండా ఉండేటట్లు తెలియజేయాలని ఆదేశించింది.
ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే వినియోగదారుల వ్యవహారాల విభాగం వారికి భారీగా జరిమానా విధించనుంది. తొలిసారి నిబంధనలను ఉల్లంఘిస్తే రూ.10 లక్షల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. రెండో సారి జరిగితే రూ. 50 లక్షల జరిమానా చెల్లించాలి. అంతే కాకుండా సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ.. వారిపై మూడేళ్ల వరకు నిషేధం కూడా విధించే అవకాశం ఉంది.