Google Flight Booking Feature : విమాన ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్. గూగుల్ ఫ్లైట్ సెలవు దినాల్లో విహారయాత్రలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఓ మనీ సేవింగ్ ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా తక్కువ ధరకే అంటే చాలా చీప్ కాస్ట్కే విమానం టికెట్లు బుక్ చేసుకోవచ్చని చెబుతోంది.
బడ్జెట్ ఫ్రెండ్లీ టైమ్
Google New Features 2023 : టెక్ దిగ్గజం గూగుల్ ఈ సరికొత్త ఫీచర్ ద్వారా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి అనువైన సమయం గురించి వినియోగదారులకు సూచనలు చేస్తుంది. దీని ద్వారా ఆ సమయంలో తక్కువ ధరకే విమానం టికెట్లు బుక్ చేసుకోవడానికి వీలవుతుంది.
ఉదాహరణకు మీరు ఓ తేదీన, ఒక ప్రత్యేకమైన ప్రాంతానికి వెళ్దామని అనుకున్నారు. అప్పుడు మీరు గూగుల్ ఫ్లైట్ వెబ్సైట్లోకి వెళ్లి, మీరు ప్రయాణించాలని అనుకుంటున్న తేదీ, గమ్యస్థానాలను నమోదుచేయాలి. అప్పుడు మీకు ఏ సమయంలో విమానం టికెట్లు తక్కువ ధరకు లభిస్తాయో.. గూగుల్ ఫ్లైట్ మనీ సేవింగ్ ఫీచర్ మీకు తెలియజేస్తుంది. ఈ విధంగా మీరు తక్కువ ధరకే విమానం టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కలుగుతుంది.
కనీసం రెండు నెలలు ముందుగా!
Best Time To Book Flight Tickets : గూగుల్ ఫ్లైట్ తీసుకొచ్చిన ఈ ఫీచర్ ద్వారా కనీసం ఆరు నెలలు ముందు నుంచే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అయితే విమాన ప్రయాణానికి కనీసం రెండు నెలల ముందు నుంచి మరింత తక్కువ ధరకే విమానం టికెట్లు బుక్ చేసుకోవడానికి వీలవుతుంది. సాధారణంగా ప్రయాణికులకు ఎప్పుడు, ఏ సమయంలో తక్కువ ధరకు విమానం టికెట్లు దొరుకుతాయో, తెలుసుకోవడం కష్టం. అందుకే గూగుల్ ఫ్లైట్ ఈ నయా ఫీచర్ను తీసుకొచ్చింది. దీని ద్వారా చాలా సులువుగా ప్రైస్ ట్రాకింగ్ చేసుకోవచ్చు.
ఆ సమయం చాలా ముఖ్యం!
How To Get Cheap Flight Tickets : సాధారణంగా విమానం టికెట్ ధరలు మొదట్లో చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ విమానం టేక్ఆఫ్ (బయలుదేరే ముందు) ఫ్లైట్ టికెట్లు బాగా తగ్గుతూ ఉంటాయి. అలాగే పండగ సీజన్లో, సెలవుల్లో విమానం టికెట్లు బాగా ఎక్కువగా ఉంటాయి. అలాంటి సమయాల్లో తక్కువ ధరకే విమానం టికెట్లు బుక్ చేయాలంటే.. గూగుల్ తెచ్చిన ఈ నయా ఫీచర్ కచ్చితంగా ఉపయోగపడుతుంది. కానీ ఇందు కోసం మీరు కచ్చితంగా గూగుల్ అకౌంట్ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది.
ప్రైస్ గ్యారెంటీ బ్యాడ్జ్
Google Flight Price Guarantee Badges : గూగుల్లో విమానం టికెట్ ధరలు చూస్తున్నప్పుడు మంచి కలర్ఫుల్ ప్రైస్ గ్యారెంటీ బ్యాడ్జెస్ కనిపిస్తుంటాయి. అంటే ఈ రోజు మీరు చూసే ఛార్జీలు బయలుదేరే ముందు ఏ మాత్రం తగ్గే అవకాశం ఉండదు.
గూగుల్ ప్రకారం..
Best Flight Booking Time : గూగుల్ ఫ్లైట్స్ ప్రకారం, క్రిస్టమస్ కోసం.. అక్టోబర్ మొదట్లోనే విమానం టికెట్లు బుక్ చేసుకోవడం మంచిది. దీని వల్ల ఫ్లైట్ టికెట్స్ చాలా తక్కువ ధరకే లభిస్తాయి. 2020 నాటి డేటా ప్రకారం, ప్రయాణానికి కనీసం 22 రోజుల ముందు విమానం టికెట్లు బుక్ చేస్తే, సగటు ధరలు తక్కువగా ఉంటాయి. మొత్తంగా చూసుకుంటే.. ప్రయాణానికి 54-78 రోజుల ముందు ఫ్లైట్ ఛార్జీలు తక్కువగా ఉంటే అవకాశం ఉంది.