Gold Rate Today 1st November 2023 : దేశంలో పసిడి, వెండి ధరలు భారీగా తగ్గాయి. మంగళవారం 10 గ్రాముల బంగారం ధర రూ.63,130 ఉండగా.. బుధవారం రూ.351 తగ్గి రూ.62,779కు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.74,120గా ఉండగా.. బుధవారం రూ.1,305 తగ్గి రూ.72,815కు చేరుకుంది..
- Gold Price In Hyderabad 1st November 2023 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.62,779గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.72,815గా ఉంది.
- Gold Price In Vijayawada 1st November 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.62,779గా ఉంది. కిలో వెండి ధర రూ.72,815కు చేరుకుంది.
- Gold Price In Vishakhapatnam 1st November 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.62,779గా ఉంది. కిలో వెండి ధర రూ.72,815గా ఉంది.
- Gold Price In Proddatur 1st November 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.62,779గా ఉంది. కిలో వెండి ధర రూ.72,815కు చేరుకుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price 1st November 2023 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేట్లు భారీగా దిగివస్తున్నాయి. మంగళవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1993 డాలర్లుగా ఉండగా.. బుధవారం ఏకంగా 14 డాలర్లు తగ్గి 1979 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరో వైపు సిల్వర్ ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 22.70 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 1st November 2023 : బుధవారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ స్వల్ప లాభాలతో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.28,64,628 వద్ద లాభాల్లో కొనసాగుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.28,64,628 |
ఇథీరియం | రూ.1,50,695 |
టెథర్ | రూ.83.30 |
బైనాన్స్ కాయిన్ | రూ.18,750 |
యూఎస్డీ కాయిన్ | రూ.83.26 |
స్టాక్ మార్కెట్ అప్డేట్స్..
Stock Market Today 1st November 2023 : బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. బ్యాంకింగ్, ఫైనాన్సియల్, మెటల్ స్టాక్స్ నేలచూపులు చూస్తున్నాయి. పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతుండడం సహా, విదేశీ సంస్థాగత పెట్టుబడులు తరలివెళ్తున్న నేపథ్యంలో.. పెట్టుబడిదారులు ఊగిసలాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే దేశీయ స్టాక్‌మార్కెట్లు తీవ్రమైన ఒడుదొడుకులకు లోనవుతున్నాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 162 పాయింట్లు నష్టపోయి 63,712 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 39 పాయింట్లు కోల్పోయి 19,040 వద్ద ట్రేడ్ అవుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న షేర్స్ : బజాజ్ ఫైనాన్స్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, రిలయన్స్, టాటా మోటార్స్, సన్‌ఫార్మా, ఐటీసీ, టైటాన్
- నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : ఎల్ అండ్ టీ, ఏసియన్ పెయింట్స్, కోటక్ బ్యాంక్, మారుతి సుజుకి, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్
రూపాయి విలువ!
Rupee Open 1st November 2023 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 3 పైసలు తగ్గింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.27గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices 1st November 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.64గా ఉంది. డీజిల్ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.46గా ఉంది. డీజిల్ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.
ముడి చమురు ధరలు
Crude Oil Price 1st November 2023 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.05 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు ధర 87.41 డాలర్లుగా ఉంది.