ETV Bharat / business

దిగొచ్చిన బంగారం ధర... ఏపీ, తెలంగాణలో ఎంత తగ్గిందంటే?

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

gold price
gold price
author img

By

Published : Nov 28, 2022, 10:00 AM IST

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు కాస్త తగ్గాయి. 10 గ్రాముల పసిడి ధర రూ.145‬ తగ్గింది. ప్రస్తుతం రూ.54,370 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.500 పడిపోయింది. ప్రస్తుతం కేజీ వెండి రూ.64,330 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.54,370గా ఉంది. కిలో వెండి ధర రూ.64,330 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.54,370 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.64,330గా ఉంది.
  • Gold price in Vizag: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.54,370గా ఉంది. కేజీ వెండి ధర రూ.64,330 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.54,370 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.64,330గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,751.20 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 21.26 డాలర్ల వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.13,22,373 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.13,22,373
ఇథీరియంరూ.95,693
టెథర్​రూ.81.70
బైనాన్స్​ కాయిన్​రూ.23,971
యూఎస్​డీ కాయిన్రూ.81.73

స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి. తొలుత నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు.. కొనుగోళ్ల మద్దతు లభించడంతో పుంజుకొని లాభాల్లోకి ప్రవేశించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 64.72 పాయింట్లు లాభపడి 62,358.36 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 16.60 పాయింట్లు లాభపడి 18,529.35 దగ్గర ట్రేడ్‌ అవుతోంది. విప్రో, రిలయన్స్‌, మారుతీ, పవర్‌గ్రిడ్ షేర్లు లాభాల్లో ఉండగా.. సన్‌ ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌, ఇన్ఫీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి విలువ
రూపాయి విలువ 6 పైసలు పడిపోయింది. ప్రస్తుతం డాలరుతో పోలిస్తే 81.77 వద్ద ట్రేడవుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.